సమాజంలో పుస్తక పఠనం తగ్గుతుందని వస్తున్న ప్రచారం అవాస్తవమని దీనికి ఈ పుస్తక ప్రదర్శన శాలకు విచ్చేస్తున్న సందర్శకులే నిదర్శనమని సీపీఐ జాతీయ మాజీ ప్రధాన కార్యదర్శి సురవరం సుధాకర్ రెడ్డి పేర్కొన్నారు.
హైదరాబాద్ ఎన్టీఆర్ స్టేడియంలో జరుగుతున్న 33వ జాతీయ పుస్తక ప్రదర్శనశాలలో తెలంగాణ ఆర్మ్డ్ స్ట్రగుల్, ప్రపంచ పదులు అనే రెండు పుస్తకాలను ఆవిష్కరించారు. జాతీయోద్యమంలో భాగంగా తెలంగాణలో కమ్యూనిస్టుల సాయుధ పోరాటం చారిత్రాత్మకమైనదని ఆయన అన్నారు.
ఇదీ చూడండి: పోలీసులు స్ట్రిక్ట్.. ఈసారి తగ్గిన ఈవెంట్ల జోష్...