ETV Bharat / state

'అనుమతుల్లేకుండా గన్​పౌడర్ తయారీ.. ఇద్దరు అరెస్ట్'

హైదరాబాద్‌ నుంచి కరీంనగర్‌కు గన్​పౌడర్ రవాణా చేస్తున్న ఇద్దరు వ్యక్తులను టాస్క్​ఫోర్స్ పోలీసులు అరెస్టు చేశారు. వారి నుంచి 40 కిలోల గన్‌పౌడర్‌, 50 కిలోల సోడియం నైట్రేట్‌, 50 కిలోల సల్ఫర్‌, రెండు చరవాణులు, ఆటో స్వాధీనం చేసుకున్నారు.

'అనుమతుల్లేకుండా గన్​పౌడర్ తయారీ.. ఇద్దరు అరెస్ట్'
'అనుమతుల్లేకుండా గన్​పౌడర్ తయారీ.. ఇద్దరు అరెస్ట్'
author img

By

Published : Feb 26, 2021, 6:57 PM IST

అనుమతులు లేకుండా గన్‌పౌడర్‌ తయారు చేసి హైదరాబాద్‌ నుంచి కరీంనగర్‌కు రవాణా చేస్తున్న ఇద్దరిని టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు పట్టుకున్నారు. వారి వద్ద నుంచి 40 కిలోల గన్‌పౌడర్‌, 50 కిలోల సోడియం నైట్రేట్‌, 50 కిలోల సల్ఫర్‌, రెండు చరవాణులు, ఆటో స్వాధీనం చేసుకున్నారు.

పాతబస్తీలోని ఈదీ బజార్‌కు చెందిన మహ్మద్‌ షబ్బీర్‌, హమీద్‌ ఖాన్‌ కలిసి గన్‌పౌడర్‌ తయారు చేస్తున్నారు. షబ్బీర్‌ తండ్రి గతంలో ఈ వ్యాపారం చేసేవాడు. ఆయన మరణించిన తర్వాత లైసెన్స్‌ రద్దయింది. తిరిగి పునరుద్ధరించకుండా షబ్బీర్ అక్రమంగా పౌడర్‌ తయారు చేస్తున్నాడు.

ఈ క్రమంలో గన్‌పౌడర్‌ను కిలో రూ. 45 చొప్పున విక్రయించడానికి కరీంనగర్‌కు చెందిన సతీశ్​, విష్ణువర్ధన్​తో అంగీకారం కుదర్చుకున్నారు. ప్రైవేట్ రవాణా కార్యాలయాల ద్వారా లారీల్లో పౌడర్‌ను తరలిస్తున్నట్టు సమాచారం అందుకున్న పోలీసులు దాడి చేసి నిందితులను పట్టుకున్నారు. ఈ పౌడర్‌ను క్వారీల్లో ఉపయోగించేందుకు తరలిస్తున్నట్టు పోలీసులు తెలిపారు.

ఇదీ చూడండి: కిడ్నాప్​ కేసు: మూడు గంటల్లోనే ఛేదించిన పోలీసులు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.