వేరువేరుగా కార్యక్రమాలు నిర్వహిస్తున్న ధర్మప్రచార పరిషత్, అన్నమాచార్య ప్రాజెక్టు, దాససాహిత్య ప్రాజెక్టు, ఆళ్వార్ దివ్య ప్రబంధ ప్రాజెక్టుతో పాటు.. సంబంధిత ఇతర ప్రాజెక్టులను హెచ్‌డీపీపీలో విలీనం చేయనున్నట్లు తితిదే ఈవో జవహర్‌రెడ్డి తెలిపారు. పరిశోధన, కార్యక్రమాల రూపకల్పన, ముద్రణ, ప్రచారం ఉప విభాగాలను ఏర్పాటు చేయాలన్నారు. ఉప విభాగాలు తమకు కేటాయించిన విధులు నిర్వహించాల్సి ఉంటుందని, తద్వారా ధర్మ ప్రచారాన్ని మరింత ముందుకు తీసుకెళ్లే సౌలభ్యం ఉంటుందని ఈవో తెలిపారు.
సప్తగిరి మాసపత్రిక పాత సంచికలను డిజిటలైజ్ చేయాలని ఆదేశించారు. తితిదేకు అవసరమైన అన్నిరకాల మందుల కొనుగోలుకు కేంద్రీకృత విధానాన్ని అనుసరించాలని ఈవో సూచించారు. ఉద్యోగులకు ఇస్తున్న శిక్షణలో పలు మార్పులు తీసుకురావాలని.. క్యాడర్ వారీగా శిక్షణ ఇచ్చే పద్ధతులను తయారు చేయాలని జేఈవోకు తెలిపారు. సమీక్షలో అదనపు ఈవో ధర్మారెడ్డి, జేఈవో సదా భార్గవి, సీవీఎస్వో గోపినాథ్ జెట్టి, స్విమ్స్ సంచాలకులు డాక్టర్ బి.వెంగమ్మ తదితరులు పాల్గొన్నారు.
ఇదీ చదవండి: మంథని మున్సిపల్ ఛైర్పర్సన్ పుట్ట శైలజపై కేసు నమోదు