తిరుపతిలోని (ttd) శ్రీ గోవిందరాజస్వామివారి (govindaraju temple) ఆలయంలో పవిత్రోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఆలయంలో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించారు. ఉదయం స్వామివారిని సుప్రభాతంతో మేలుకొలిపి, తోమాలసేవ, సహస్రనామార్చన నిర్వహించారు. కరోనా నేపథ్యంలో పవిత్రోత్సవాలను ఆలయ అధికారులు ఏకాంతంగానే నిర్వహించారు.
శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ గోవిందరాజస్వామి ఉత్సవ మూర్తులను యాగశాలకు వేంచేపు చేసి వైదిక కార్యక్రమాలు నిర్వహించారు. స్వామి, అమ్మవార్ల ఉత్సవమూర్తులకు.. పాలు, పెరుగు, తేనె, కొబ్బరినీళ్లు, పసుపు, చందనాలతో అభిషేకం నిర్వహించారు. ఆలయంలోని యాగశాలలో వైదిక కార్యక్రమాల అనంతరం పవిత్ర ప్రతిష్ఠ చేశారు. యాత్రికులు, సిబ్బంది ద్వారా జరిగే దోషాలను నివారించేందుకు ఏటా మూడు రోజులపాటు ఈ ఉత్సవాలను నిర్వహిస్తారు.
ఇదీ చూడండి: TTD Incense Sticks: తితిదే బ్రాండ్‌తో అగరబత్తీలు.. ఆ పూలతోనే తయారీ.!