ETV Bharat / state

వలస కూలీలకు, నిరుపేదలకు టీటీడీ ఆపన్నహస్తం - హిమాయత్​నగర్​ తాజా వార్త

హైదరాబాద్​లోని నిరుపేదలు, వలస కూలీలను ఆదుకోవడానికి టీటీడీ లోకల్​ అడ్వజరీ కమిటీ సభ్యులు ముందుకొచ్చారు. హిమాయత్​ నగరంలోని టీటీడీ కల్యాణ మండపంలో ఏర్పాటు చేసిన నిత్యావసరాల వితరణ కార్యక్రమాన్ని తిరుమల తిరుపతి దేవస్థానం ఛైర్మన్​ వైవి సుబ్బారెడ్డి ప్రారంభించారు.

Ttd Chairman yv subbareddy On Food Packets distribution to the poor in himayath nagar Hyderabad
వలస కూలీలకు టీటీడి ఆపన్నహస్తం
author img

By

Published : Apr 21, 2020, 4:48 AM IST

ప్రపంచ వ్యాప్తంగా కరోనా విస్తరిస్తున్న నేపథ్యంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకుంటున్న నివారణ చర్యల అమలుకు ప్రజలు సహకరించాలని తిరుమల తిరుపతి దేవస్థానం(టీటీడీ) ఛైర్మెన్ వైవి సుబ్బారెడ్డి కోరారు. లాక్​డౌన్ వల్ల తిరుపతి దేవస్థానంలో భక్తులకు దర్శనం నిలిపివేసినప్పటికి... కరోనా మహమ్మారి తొలిగిపోవడానికి నిత్యం వేద పారాయణం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. టీటీడీ లోకల్ అడ్వైజరీ​ కమిటీ సభ్యుల సహకారంతో నిరుపేదలు, వలస కూలీలకు హైదరాబాద్ హిమాయత్ నగర్​లోని టీటీడి కల్యాణ మండపంలో ఏర్పాటు చేసిన నిత్యావసరాల పంపిణీని ఆయన ప్రారంభించారు.

కరోనా వైరస్ నివారణ చర్యల్లో భాగంగా ఏపీలో టీటీడీ నిధులతో ఐసోలేషన్ వార్డును నిర్మించామని అన్నారు. తిరుపతి పరిసరాల్లో ప్రతి రోజు 60 వేల మంది పేదలకు రెండు పూటలా నిత్య అన్నదానం చేస్తున్నట్టు వెల్లడించారు. వలస కూలీలను ఆదుకునేందుకు టీటీడి లోకల్ అడ్వైజరీ​ కమిటీ ముందుకు రావడాన్ని ఆయన అభినందించారు. లాక్​డౌన్ వల్ల పనులు లేక ఇబ్బంది పడుతున్న 5 వేల కుటుంబాలకు నిత్యావసర సరుకులను అందజేయనున్నట్లు ఆయన తెలిపారు.

ఇదీ చదవండిః 'జూమ్​' యాప్​ ఎందుకు సురక్షితం కాదంటే...!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.