రాష్ట్రవ్యాప్తంగా రెండో రోజు ఆర్టీసీ కార్మికుల సమ్మె కొనసాగుతోంది. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసే వరకు సమ్మెను కొనసాగిస్తామని కార్మికులు చెబుతున్నారు. ప్రభుత్వం ఆర్టీసీ ఉద్యోగులను పట్టించుకోవడం లేదని ఆరోపించారు. పండుగ ఉందని సమ్మెను విరమించమని ప్రభుత్వం చెబుతుందని... ఇది ఇప్పటి సమస్య కాదని ఎప్పటి నుంచో తాము విజ్ఞప్తి చేసినా.. పక్కన పెట్టేశారని వాపోతున్నారు. ప్రభుత్వం మొండి వైఖరి మానుకోవాలని సూచించారు. ఆర్టీసీని ఒక సంస్థగా కాకుండా సేవరంగంగా గుర్తించాలని కోరారు.
ఇవీ చూడండి: సద్దుల బతుకమ్మ ఉయ్యాలో... ఊరూర సంబురమే ఉయ్యాలో!!!