ETV Bharat / state

అదే పటిమ.. ఆగని ఆర్టీసీ కార్మికుల సమ్మె

author img

By

Published : Oct 25, 2019, 12:58 PM IST

20 రోజులు గడిచిన ఆర్టీసీ సమ్మె కొనసాగుతూనే ఉంది. అటు ప్రభుత్వం.. ఇటు ఆర్టీసీ కార్మికులు ఇద్దరూ తగ్గడం లేదు. దీనితో సామాన్య ప్రజలు తీవ్ర ఇక్కట్లు పడాల్సి వస్తోంది. మరోవైపు ఆర్టీసీ కార్మికుల సమ్మెపై ముఖ్యమంత్రి చేసిన వ్యాఖ్యలను ఐకాస నేతలు ఖండించారు. అయినా కార్మికులు అధైర్యపడొద్దని ఐకాస నేతలు అన్నారు. మరోవైపు రాష్ట్రవ్యాప్తంగా కార్మికుల సమ్మె ఉద్ధృతంగా సాగుతోంది.

కొనసాగుతున్న సమ్మె.. ఆగని కార్మికుల నిరసనలు

హైదరాబాద్‌లోని ఎంప్లాయిస్ యూనియన్ కార్యాలయంలో ఆర్టీసీ ఐకాస నేతలు సమావేశమయ్యారు. సమ్మెపై నిన్న ముఖ్యమంత్రి కేసీఆర్​ చేసిన వ్యాఖ్యలపై చర్చించారు. కార్మిక సంఘాల నాయకులపై అపోహాలు సృష్టించి... కార్మికులను దూరం చేయాలని ప్రభుత్వం కుట్ర పన్నుతోందని ఆర్టీసీ ఐకాస నేతలు తీవ్రంగా ఆక్షేపించారు. ఆర్టీసీ నష్టాలకు ప్రభుత్వమే కారణమని పేర్కొన్న ఐకాస నేతలు... సంస్థ ఆస్తులను కొల్లగొట్టెందుకు సీఎం కుట్ర చేస్తున్నారని ఆరోపించారు. ప్రభుత్వానికి వేలకోట్ల పన్ను కడితే... ఆర్టీసీకి లాభాలెలా వస్తాయని ప్రశ్నించారు. సంస్థ ఆస్తులను కాజేసి ప్రైవేటు పరం చేసేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్​ కంకణం కట్టుకున్నారని ఐకాస నేతలు దుయ్యబట్టారు.

రాష్ట్ర వ్యాప్తంగా అన్ని డిపోల వద్ద దీక్షలు

అంతకుముందు.. ఆర్టీసీ మహిళా ఉద్యోగులు రాష్ట్రవ్యాప్తంగా అన్ని డిపోల వద్ద నిరాహారదీక్షలు చేపట్టారు. సమస్య పరిష్కారంలో జోక్యం చేసుకోవాలని కోరుతూ పలుచోట్ల గవర్నర్, రాష్ట్రపతిలకు కార్మికులు లేఖలు రాశారు. ఆర్టీసీ నష్టాలకు ప్రభుత్వమే కారణమని ఆరోపిస్తూ.. పలు జిల్లాల్లో భారీ ర్యాలీలు నిర్వహించారు. కరీంనగర్‌, జగిత్యాల, సిద్దిపేట డిపోల ఆవరణలో మహిళా కండక్టర్ల దీక్షకు ఎమ్మార్పీఎస్ నేత మందకృష్ణ మాదిగ సంఘీభావం తెలిపారు. ఖమ్మం, మహబూబాబాద్‌లోని డిపో ఎదుట కార్మికుల దీక్షా శిబిరాన్ని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం సందర్శించారు. హైదరాబాద్‌లోని ధర్నా చౌక్‌లో ఏర్పాటు చేసిన దీక్షా శిబిరం... ధూంధాం పాటలతో దద్దరిల్లింది.

కమిటీ నివేదిక సిద్ధం

మరోవైపు హైకోర్టు సూచనల మేరకు 21 డిమాండ్లను పరిశీలించేందుకు నియమించిన ఆరుగురు అధికారుల కమిటీ... నివేదిక సిద్ధం చేసింది. అందులోని ముఖ్యాంశాలను ఆర్టీసీ ఇన్​ఛార్జ్ ఎండీ సునీల్ శర్మకు వివరించిన అధికారులు.. నివేదిక ప్రతిని అందజేశారు. అయితే సునీల్‌శర్మ చేసిన కొన్ని సూచనలతో అధికారులు తుది నివేదికను సిద్ధం చేయనున్నారు. ఈనెల 28న హైకోర్టులో కేసు విచారణకు రానున్న నేపథ్యంలో ప్రభుత్వ వాదన స్పష్టంగా ఉండేలా పూర్తిస్థాయి కసరత్తు చేపట్టారు. నాలుగైదు మినహా మిగిలిన డిమాండ్ల అమలుకు ప్రభుత్వం సానుకూలంగా ఉన్నట్లు తెలుస్తోంది.

అద్దె ప్రతిపాదికన బస్సులు

అటు అద్దె ప్రతిపాదికన బస్సులు తీసుకునేందుకు ఆర్టీసీ యాజమాన్యం కాంట్రాక్టర్ల నుంచి మరో దఫా టెండర్లు ఆహ్వానించింది. కొత్తగా 1,248 బస్సులు తీసుకోవాలని నిర్ణయించింది. గ్రామీణ ప్రాంతాలకు వెయ్యి , గ్రేటర్ పరిధిలో 248 బస్సులను తీసుకునేందుకు ప్రభుత్వం కార్యాచరణ రూపొందించింది.

ఇదీ చూడండి: బంపర్ ఆఫర్​: పాత బంగారానికి... కొత్త ఆభరణాలు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.