TSRTC Sankranti Special Buses: సంక్రాంతికి సొంతూళ్లకు వెళ్లే వారు ఇబ్బందులు పడకుండా తెలంగాణ ఆర్టీసీ ప్రత్యేక ఏర్పాట్లు చేస్తోంది. ఇందులో భాగంగానే.. జనవరి 7 నుంచి 15వ తేది వరకు 4,233 ప్రత్యేక బస్సులను నడపనుంది. అందులో 585 సర్వీసులకు రిజర్వేషన్ సౌకర్యం కల్పించింది. సంక్రాంతికి ప్రత్యేక బస్సుల ఏర్పాటు.. ఇతర అంశాలపై టీఎస్ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్ హైదరాబాద్ బస్ భవన్ నుంచి ఉన్నతాధికారులు, ఆర్ఎంలు, డీఎంలతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. గతేడాది కన్నా ఈ సంక్రాంతికి.. 10 శాతం అదనపు బస్సులను నడుపుతున్నామని ఎండీ వీసీ సజ్జనార్ తెలిపారు.
రాష్ట్రంలోని అన్ని ప్రధాన నగరాలు, పట్ణణాలకు ప్రత్యేక బస్సు సర్వీసులను నడిపేలా చర్యలు తీసుకోవాలని.. ఆర్ఎమ్లు, డీఎమ్లకు సజ్జనార్ సూచించారు. రాబోయే 60 రోజులు తెలంగాణ ఆర్టీసీకి ఎంతో ముఖ్యమైనవని.. అందుకనుగుణంగా సిబ్బంది పనిచేయాలని చెప్పారు. ప్రయాణికుల సౌకర్యార్థం అడ్వాన్స్ టికెట్ బుకింగ్‌ను 30 రోజుల నుంచి 60 రోజులకు పెంచినట్లు తెలిపారు. ప్రయాణికులందరూ ఈ సదుపాయాన్ని వినియోగించుకోవాలని ఆయన కోరారు.
ఇవీ చదవండి: