ETV Bharat / state

త్వరలో టీఎస్​ఆర్టీసీకి 1000 ఎలక్ట్రిక్​ బస్సులు - టీఎస్​ఆర్టీసీ కొత్త బస్సు

TSRTC Introduced 80 New Buses Today : రాష్ట్రంలో మరిన్ని ఆర్టీసీ కొత్త బస్సులు రహదారులపై పరుగులు తీయనున్నాయి. టీఎస్​ఆర్టీసీ ప్రజల ఇబ్బందులను, సంస్థ ఆర్థిక అవసరాలను దృష్టిలో పెట్టుకుని 80 కొత్త బస్సులను ప్రారంభించింది. ఈ బస్సులను మంత్రి పొన్నం ప్రభాకర్‌ ఇవాళ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో టీఎస్ఆర్టీసీ ఎండీ సజ్జనార్​ పాల్గొన్నారు.

Government Launched 80 New TSRTC Buses
TSRTC Introduced 80 New Buses Today
author img

By ETV Bharat Telangana Team

Published : Dec 30, 2023, 11:14 AM IST

Updated : Dec 30, 2023, 12:36 PM IST

80 కొత్త బస్సులను ప్రారంభించిన టీఎస్​ఆర్టీసీ త్వరలో 1000 ఎలక్ట్రిక్​ బస్సులు

TSRTC Introduced 80 New Buses Today : నిత్యం మెరుగైన సౌకర్యాలతో ప్రజలకు చేరువలో ఉంటున్న సంస్థ ఈసారి అధునాతన బస్సులను ప్రవేశపెట్టింది. హైదరాబాద్​లోని అంబేడ్కర్​ విగ్రహం వద్ద 80 ఆర్టీసీ బస్సులను రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్(Ponnam Prabhakar)​ ప్రారంభించారు. 30 ఎక్స్​ప్రెస్​, 30 రాజధాని ఏసీ, 20 లహరి స్లీపర్​ అండ్​ సీటర్​ బస్సులు అందుబాటులోకి వచ్చాయి. ఈ కార్యక్రమంలో టీఎస్​ఆర్టీసీ ఎండీ సజ్జనార్ పాల్గొన్నారు.

పురుషుల కోసం టీఎస్​ఆర్టీసీ స్పెషల్ బస్సులు- సీనియర్ సిటిజన్లకే తొలి ప్రాధాన్యం

Minister Ponnam Prabhakar Inaugurate New TSRTC Buses : కార్మికుల సంక్షేమం, ఆర్టీసీ పరిరక్షణ, ప్రయాణికులకు సౌకర్యానికి పెద్దపీట వేయాలని సీఎం రేవంత్​రెడ్డి(CM Revanth Reddy) తెలిపారని మంత్రి చెప్పారు. ఇప్పటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా 6కోట్ల మంది మహిళలు మహాలక్ష్మి పథకం ద్వారా ఉచిత ప్రయాణం చేశారని అన్నారు. ఇది ప్రజల ప్రభుత్వమని, ప్రజా పాలన చేస్తామని తెలిపారు. ఆర్టీసీ బకాయిలను వీలైనంత త్వరగా విడుదల చేస్తామని హామీ ఇచ్చారు. టీఎస్​ఆర్టీసీ(TSRTC) ఓఆర్(ఆక్యుపెన్సీ రేషియో) వంద శాతానికి చేరుకుందని హర్షం వ్యక్తం చేశారు. ప్రయాణికుల సౌకర్యాలపై సంస్థ అధికారులతో సమీక్ష నిర్వహించామని అన్నారు. తెలంగాణ ఉద్యమంలో ఆర్టీసీ పాత్ర కీలకమైందిగా అభిప్రాయం వ్యక్తం చేశారు. త్వరలో వెయ్యి ఎలక్ట్రిక్ బస్సులను సమకూర్చుకుంటామని పేర్కొన్నారు.

"కార్మికుల సంక్షేమం, ఆర్టీసి పరిరక్షణ, ప్రయాణికులకు సౌకర్యానికి పెద్దపీట వేయాలని సీఎం చెప్పారు. ఇప్పటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా 6కోట్ల మంది మహిళలు మహాలక్ష్మి పథకం ద్వారా ఉచిత ప్రయాణం చేశారు. టీఎస్​ఆర్టీసీ బకాయిలను వీలైనంత త్వరగా విడుదల చేస్తాం."- పొన్నం ప్రభాకర్, రవాణా శాఖ మంత్రి

Government Launched 80 New TSRTC Buses : రాష్ట్రంలోని త్వరలోనే వెయ్యి ఎలక్ట్రిక్ బస్సులు రాబోతున్నాయని ఎండీ సజ్జనార్ చెప్పారు. అందులో 500హైదరాబాద్​కు మరో 500 బస్సులు జిల్లాలో తిరగనున్నాయని స్పష్టం చేశారు. మహాలక్ష్మి పథకం ప్రారంభించినప్పటి నుంచి 20రోజుల్లో రోజుకు 30లక్షల మంది ఉచిత ప్రయాణం చేస్తున్నారని ఆయన తెలిపారు.

ఉచిత బస్సు ప్రయాణం వల్ల పెరిగిన రద్దీ - రేపు కొత్తగా 80 ఆర్టీసీ బస్సులు ప్రారంభం

VC Sajjanar on New Buses in Telangana : 2023-24 ఆర్థిక సంవత్సరానికి రూ.400 కోట్ల వ్యయంతో అధునాతనమైన 1050 కొత్త డీజిల్ బస్సులను కొనుగోలు చేయాలని సంస్థ నిర్ణయించిందని సజ్జనార్ తెలిపారు. వాటిలో 400 ఎక్స్​ప్రెస్, 512 పల్లె వెలుగు, 92 లహరి స్లీపర్ కమ్ సీటర్, 56 ఏసీ రాజధాని బస్సులున్నాయని చెప్పారు. ఈ బస్సులన్నీ విడతల వారీగా మార్చి, 2024 నాటికి ప్రయాణికులకు అందుబాటులోకి తీసుకువచ్చేలా సంస్థ ప్రణాళికలు వేస్తోందని తెలిపారు. మహాలక్ష్మి పథకం(Mahalakshmi Scheme in Telangana) ద్వారా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం అందుతోందని గుర్తు చేశారు. దీంతో బస్సుల్లో పెరిగిన రద్దీకి అనుగుణంగా ఈ కొత్త బస్సులను సంస్థ వినియోగించుకోనుందని స్పష్టం చేశారు.

మహిళలకు ఉచిత పథకం ఎఫెక్ట్​ మాములుగా లేదుగా- 11 రోజుల్లో రికార్డు స్థాయిలో ప్రయాణాలు

Last Updated : Dec 30, 2023, 12:36 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.