తమ సమస్యలను వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ... హైదరాబాద్ తుర్కయాంజల్‌లోని ఆర్డీఓ కార్యాలయం ఎదుట ఆర్టీసీ కార్మికులు ఆందోళనకు దిగారు. 24 రోజులుగా నిరవధిక సమ్మె చేస్తున్నా ప్రభుత్వం ఇప్పటికీ మొండి వైఖరి ప్రదర్శిస్తోందని కార్మికులు మండిపడ్డారు. తమ డిమాండ్లను ప్రభుత్వం వెంటనే నెరవేర్చాలని కోరుతూ ఇబ్రహీంపట్నం ఆర్డీవో అమరేందర్‌కు వినతి పత్రం అందజేశారు. కార్యాలయం ఎదుట అందోళనకు దిగిన కార్మికులకు సీపీఎం, భాజపా, కాంగ్రెస్ నేతలు మద్దతు తెలిపారు. కార్మికులతో కలిసి నిరసన వ్యక్తం చేశారు. ఆత్మహత్యకు పాల్పడిన ఆర్టీసీ కార్మికుల ఆత్మకు శాంతి చేకూరాలని మౌనం పాటించారు.
ఇదీ చదవండిః 'నిమ్స్ నుంచే నిరాహార దీక్ష కొనసాగిస్తా'