ETV Bharat / state

'ఆర్టీసీ నష్టాలు వీడి... లాభాల్లోకి పరిగెత్తేనా?' - Tsrtc in losses

కరోనా దెబ్బకు కుదేలైన ఆర్టీసీ... గడిచిన 7 నెలల్లో రూ. 1,579 కోట్ల నష్టాన్ని మూటగట్టుకుంది. మే 19 నుంచి ఆర్టీసీ బస్సులు రోడ్డెక్కినప్పటికీ... ప్రజలు ప్రయాణించకపోవడం వల్ల నష్టాలు వెంటాడుతూనే ఉన్నాయి. మే నుంచి అక్టోబర్ వరకు క్రమంగా ఆదాయం పెరుగుతూ వస్తున్నా... సంస్థ ఇంకా నష్టాల్లోనే ఉంది. ఏపీ, తెలంగాణ మధ్య బస్సులు ప్రారంభం కావడం... ఆదాయం మరింత పెరుగుతుందని సంస్థ యాజమాన్యం అశాభావం వ్యక్తం చేస్తోంది.

'ఆర్టీసీ నష్టాలు వీడి... లాభాల్లోకి పరిగెత్తేనా?'

author img

By

Published : Nov 4, 2020, 5:03 AM IST

'ఆర్టీసీ నష్టాలు వీడి... లాభాల్లోకి పరిగెత్తేనా?'

లాక్‌డౌన్‌ అనంతరం ప్రజా రవాణాకు ప్రభుత్వం అనుమతి ఇవ్వగా మే 19 నుంచి ఆర్టీసీ బస్సులు రాష్ట్రవ్యాప్తంగా రోడ్డెక్కాయి. ప్రారంభంలో 4 వేల బస్సులను మాత్రమే నడిపించారు. ప్రస్తుతం 6వేల బస్సులు తిరుగుతున్నాయి. ప్రారంభంలో ఆక్యుపెన్సీ రేషియో కేవలం 34 మాత్రమే ఉండేది. ప్రస్తుతం 55కు చేరుకుంది. ఆర్టీసీ అధికారులు అన్ని బస్టాండ్లలో, బస్ పాయింట్లలో అదనపు సిబ్బందిని ఏర్పాటు చేసి... ఓఆర్​ పెంచేందుకు చర్యలు తీసుకున్నారు.

1,579 కోట్ల ఆదాయం...

లాక్​డౌన్​కు ముందురోజుకు సుమారు రూ. 12 కోట్ల ఆదాయం వచ్చేది. ప్రస్తుతం రోజుకు కేవలం రూ. 6 కోట్లు మాత్రమే ఆదాయం సమకూరుతోంది. గడచిన ఏడు నెలల్లో ఆర్టీసీకి కేవలం రూ. 581 కోట్ల ఆదాయం మాత్రమే వచ్చింది. సుమారు రూ. 1,579 కోట్ల ఆదాయం కోల్పోయింది.

రద్దీని బట్టి...

అంతర్రాష్ట్ర సర్వీసుల్లో మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాలకు ఇప్పటికే సుమారు 300ల బస్సులను తిప్పుతున్నారు. ఏపీతో అవగాహన ఒప్పందంతో తెలుగు రాష్ట్రాల మధ్య బస్సులు ప్రారంభమయ్యాయి. ప్రస్తుతం 745 బస్సులకు గాను... 450 బస్సులను ఏపీకి తిప్పాలని ఆర్టీసీ అధికారులు భావిస్తున్నారు.

ప్రయాణికుల రద్దీని బట్టీ బస్సుల సంఖ్యను పెంచుతూ పోవాలని యోచిస్తున్నారు. వీటితో ఆదాయం పెరిగే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు.

లాభాల్లోకి వెళ్లేనా...

దీపావళి పండుగతో ఆర్టీసీ గాడిలో పడుతుందని అభిప్రాయపడుతున్నారు. తెలుగు రాష్ట్రాల మధ్య అంతర్రాష్ట్ర సర్వీసుల ప్రారంభం, కార్గొ, కొరియర్‌ పార్శిల్‌ సేవలతో ఆర్టీసీ నష్టాల బాటను వీడి లాభాల్లోకి వెళ్తుందని ఆర్టీసీ యాజమాన్యం ఆశాభావం వ్యక్తం చేస్తోంది.

ఇదీ చూడండి:ఈనెల 13 తర్వాత ఎప్పుడైనా జీహెచ్​ఎంసీ ఎన్నికల నోటిఫికేషన్​ : ఎస్​ఈసీ

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.