చిట్టీలు, ఫిక్స్డ్ డిపాజిట్ల పేరుతో తెలంగాణ ఆర్టీసీ కార్మికుల నుంచి రూ. 6 కోట్లు వసూలు చేసి పారిపోయిన దిల్సుఖ్నగర్ ఆర్టీసీ డిపో కంట్రోలర్ కందూరి సురేందర్‌పై కఠిన చర్యలు తీసుకోవాలని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. బాధితులు రాచకొండ సీపీ మహేశ్‌భగవత్‌ను కలిసి పూర్తి వివరాలను అందిస్తామంటూ కమిషనరేట్ కార్యాలయం ఎదుట నిరసనకు దిగారు.
తాము ఎంతో కష్టపడి సంపాదించిన డబ్బును పోగొట్టుకున్నామని బాధితులు వాపోయారు. తమకు న్యాయం జరిపించాలని, తమ పిల్లల పెళ్లిళ్లకు దాచిపెట్టిన డబ్బులను ఎత్తుకుపోయారని పలువురు ఆర్టీసీ కార్మికులు ఆవేదన వ్యక్తం చేశారు. పోలీసులు స్పందించి.. తమకు న్యాయం జరిగేలా చూడాలని కోరుతున్నారు.
ఇదీ చూడండి: పీవీకి భారతరత్న ఇవ్వాలని శాసనసభ ఏకగ్రీవ తీర్మానం