ETV Bharat / state

'టీఎస్, ఏపీఎస్ ఆర్టీసీ మధ్య అంతర్రాష్ట్ర ఒప్పందం జరగాలి' - apsrtc Latest News

టీఎస్ఆర్టీసీ, ఏపీఎస్ఆర్టీసీ మధ్య అంతర్రాష్ట్ర ఒప్పందం చేసుకునే విధంగా సీఎం కేసీఆర్ చొరవ తీసుకోవాలని ఆర్టీసీ ఎంప్లాయిస్ యూనియన్ విజ్ఞప్తి చేసింది. రెండు తెలుగు రాష్ట్రాల మధ్య అంతర్రాష్ట్ర బస్సులను నడపాలని ఈయూ ప్రభుత్వాన్ని కోరింది. టీఎస్ఆర్టీసీ, ఏపీఎస్ఆర్టీసీ అంతర్రాష్ట్ర ఒప్పందాలపై వివిధ దశల్లో సమావేశాలు నిర్వహించారని.. సమస్యలను మాత్రం పరిష్కరించకుండా నిర్లక్ష్యం చేశారని ఆందోళన వ్యక్తం చేసింది.

'టీఎస్, ఏపీఎస్ఆర్టీసీ మధ్య అంతరాష్ట్ర ఒప్పందం కావాలి'

author img

By

Published : Sep 10, 2020, 8:39 PM IST

టీఎస్ఆర్టీసీ, ఏపీఎస్ఆర్టీసీ మధ్య అంతర్రాష్ట్ర ఒప్పందం చేసుకునే విధంగా రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ చొరవ తీసుకోవాలని ఆర్టీసీ ఎంప్లాయిస్ యూనియన్ ప్రధాన కార్యదర్శి రాజిరెడ్డి విజ్ఞప్తి చేశారు. రెండు తెలుగు రాష్ట్రాల మధ్య అంతర్రాష్ట్ర బస్సులను నడపాలని ఆర్టీసీ ఎంప్లాయిస్ యూనియన్ ప్రభుత్వాన్ని కోరారు.

వివిధ దశల్లో సమావేశాలు...

టీఎస్ఆర్టీసీ, ఏపీఎస్ఆర్టీసీ అంతర్రాష్ట్ర ఒప్పందాలపై వివిధ దశల్లో సమావేశాలు నిర్వహించారని.. సమస్యలను మాత్రం పరిష్కరించకుండా నిర్లక్ష్యం చేశారని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.

తీవ్ర వ్యతిరేకత..

ప్రైవేట్ అక్రమ రవాణా ద్వారా ఆర్టీసీ నడపడాన్ని సంఘం తీవ్రంగా వ్యతిరేకిస్తోందని ఆయన స్పష్టం చేశారు. వెంటనే ఈ విషయంపై సీఎం కేసీఆర్ కల్పించుకోవాలని యూనియన్ ప్రధాన కార్యదర్శి వినతి పత్రాన్ని అందజేశారు.

అక్కడ వెయ్యి బస్సులు, ఇక్కడ 750 బస్సులు..

ఏపీఎస్ఆర్టీసీలో దాదాపు రెండు లక్షల అరవై మూడు వేల కిలోమీటర్ల మేర తిప్పుతూ వెయ్యి బస్సులను నడుపుతోందన్నారు. అదే తెలంగాణ ఆర్టీసీ 1,53,000 కిలోమీటర్లలో 750 బస్సులు నడపుతోందని రాజిరెడ్డి వివరించారు.

అలా చేస్తే ఒరిగేదేమీ లేదు..

ఏపీఎస్ఆర్టీసీ లక్ష కిలోమీటర్లు తగ్గించుకుని సుమారు 260 బస్సులు రద్దు చేస్తే టీఎస్ఆర్టీసీకి ఒరిగేది ఏమీ ఉండదని అన్నారు. కానీ ఏపీఎస్ఆర్టీసీ రద్దు చేసిన ఒక లక్ష కిలోమీటర్లు, 260 బస్సులు, ప్రైవేట్ అక్రమ రవాణాదారులకు చొరబడేందుకు అవకాశం కల్పించినట్లు అవుతుందన్నారు. అందువల్ల ఏపీఎస్ఆర్టీసీ 55 వేల కిలోమీటర్లు తగ్గించుకుని సుమారు 130 బస్సులను మాత్రమే రద్దు చేసుకోవాలని ఆయన సూచించారు.

టీఎస్ వద్ద స్తోమత లేదు..

టీఎస్​ఆర్టీసీ వద్ద 130 బస్సుల కొనుగోలుకు ఆర్థిక స్తోమత లేదన్నారు. అందువల్ల రాష్ట్ర ప్రభుత్వం వోల్వో గరుడ ఏసీ బస్సుల కొనుగోలుకు ఆర్థిక సహాయం చేయాలని టీఎస్ ఆర్​టీసీ ఎంప్లాయిస్ యూనియన్ తరఫున ప్రభుత్వాన్ని కోరారు.

సీఎం ఆదేశాలు కావాలి...

ఏపీఎస్ఆర్టీసీతో రాష్ట్ర ప్రభుత్వం అంతర్రాష్ట్ర ఒప్పందం చేసుకుని వెంటనే సర్వీసులను పునరుద్ధరించేలా సీఎం కేసీఆర్ ఆదేశాలు ఇవ్వాలని రాజిరెడ్డి డిమాండ్ చేశారు.

ఇవీ చూడండి : విద్యా సంవత్సరం ఖరారు చేసిన ఇంటర్ బోర్డు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.