ETV Bharat / state

గ్రూప్‌-2, 3 ప్రకటనలకు కసరత్తు పూర్తి.. - అటవీ బీట్‌ అధికారులు నోటిఫికేషన్ తాజా వార్తలు

రాష్ట్రంలో త్వరలో మరికొన్ని ఉద్యోగాల ప్రకటనలకు నోటిఫికేషన్లు వెలువడనున్నాయి. నెలాఖరులోగా అటవీ బీట్‌ అధికారులు, వసతి గృహ సంక్షేమాధికారుల పోస్టులకు ప్రకటనలివ్వాలని టీఎస్​పీఎస్సీ లక్ష్యంగా పెట్టుకుంది. గ్రూప్‌-2, 3 ప్రకటనలకు కమిషన్‌ కసరత్తు పూర్తి చేసింది. కొత్తగా మరికొన్ని పోస్టులను ఆ పరిధిలోకి తేవడంతో తొలుత అనుమతించిన పోస్టులకు అదనంగా మరికొన్ని పెరిగే అవకాశం ఉంది.

TSPSC
TSPSC
author img

By

Published : Dec 16, 2022, 7:44 AM IST

నిరుద్యోగులకు గుడ్​న్యూస్.. త్వరలోనే గ్రూప్‌-2, 3 నోటిఫికేషన్​లు

త్వరలో గ్రూప్‌-2, 3 ఉద్యోగ నోటిఫికేషన్ల జారీకి రాష్ట్ర పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ కసరత్తు పూర్తి చేసింది. ప్రభుత్వ విభాగాల్లోని మరికొన్ని పోస్టులను గ్రూప్‌-2, 3 పరిధిలోకి తేవడంతో వాటి సంఖ్య పెరగనుంది. గ్రూప్‌-2 పరిధిలోకి దాదాపు 120 వరకు కొత్తగా పోస్టులు రావడంతో.. ఆ ప్రకటన కింద మొత్తం 783 ఖాళీలు ఉండే అవకాశాలున్నట్లు తెలిసింది. గ్రూప్‌-3లో పెరగనున్న పోస్టులపై కమిషన్‌ కార్యాచరణ పూర్తి చేసింది.

గ్రూప్స్‌ ఉద్యోగాలకు.. ప్రభుత్వ విభాగాల నుంచి ప్రతిపాదనల స్వీకరణ, పరిశీలన ప్రక్రియ పూర్తైందని అధికార వర్గాలు వెల్లడించాయి. ఈ నెలలోనే ఉద్యోగ ప్రకటనలు జారీ చేయనున్నట్లు సమాచారం. వాటితో పాటు టీఎస్​పీఎస్సీకి అప్పగించిన మిగతా పోస్టులకు నోటిఫికేషన్లు జారీ చేసేందుకు కమిషన్‌ సన్నద్ధమవుతోంది. నెలాఖరులోగా అటవీ బీట్‌ అధికారులు, వసతిగృహ సంక్షేమాధికారుల పోస్టులకు ప్రకటనలివ్వాలని టీఎస్​పీఎస్సీ లక్ష్యంగా పెట్టుకుంది.

నోటిఫికేషన్లు జారీ చేయాలని కమిషన్‌ నిర్ణయం: గ్రూప్‌-2 కింద 663, గ్రూప్‌-3 కింద 1,373 పోస్టులను గుర్తిస్తూ.. 2022 ఆగస్టు 30న ప్రభుత్వం జీవో జారీచేసింది. వాటికి అదనంగా వేర్వేరు విభాగాల్లో గ్రూప్‌-2, గ్రూప్‌-3 స్థాయి కలిగిన మరిన్ని ఉద్యోగాల భర్తీకి అనుమతిచ్చింది. వాటన్నిటిని కలిపి నోటిఫికేషన్లు జారీచేసి భర్తీ చేయాలని కమిషన్‌ నిర్ణయించింది. ఎస్సీ సంక్షేమశాఖలో-17, ఎస్సీ-9, బీసీ-17 సహాయ సంక్షేమాధికారి పోస్టులు గ్రూప్‌-2 పరిధిలోకి వచ్చాయి.

అదనంగా మరిన్ని పోస్టులు: శిశు సంక్షేమశాఖ ఆధ్వర్యంలోని జువైనల్‌ సర్వీస్‌ విభాగంలో.. 11 జిల్లా ప్రొబేషనరీ అధికారి పోస్టులతో పాటు ప్రభుత్వ శాఖల్లో సహాయసెక్షన్‌ అధికారుల పోస్టులు కలిపి.. గ్రూప్‌-2లో 100 వరకు పోస్టులు పెరగనున్నాయి. ఈ తరహాలోనే గ్రూప్‌-3 పరిధిలోకి అకౌంటెంట్‌, ఇతర విభాగాధిపతుల కార్యాలయాల్లో సీనియర్‌ అసిస్టెంట్, సీనియర్‌ అకౌంటెంట్.. జూనియర్‌ అసిస్టెంట్, జూనియర్‌ అకౌంటెంట్‌తో పాటు వాటికి సమానమైన ఉద్యోగాలను చేర్చారు. దీంతో మొదట అనుమతించిన 1,373 పోస్టులకు అదనంగా మరిన్ని పోస్టులు పెరగనున్నాయి.

ఇవీ చదవండి: 'బీఆర్​ఎస్​కు వీఆర్​ఎస్​ తీసుకోవడమే మిగిలి ఉంది'

బెనారస్​ చీరలా మెరిసిపోతున్న గ్రాండ్​ కేక్​ చూడడానికి ఎంత బాగుందో

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.