ETV Bharat / state

TSPSC Clarity on Group 2 Exams Postpone : 'గ్రూప్-2 పరీక్ష వాయిదాపై ఆగస్టు 14న నిర్ణయం' - తెలంగాణ హైకోర్టులో గ్రూప్​ 2 పరీక్ష కేసు

TSPSC Clarity on Group 2 Exams Postpone : టీఎస్​పీఎస్సీ గ్రూప్​ 2 పరీక్షపై తీవ్ర ఉత్కంఠ కొనసాగుతోంది. గ్రూప్​ 2 పరీక్షపై దాఖలైన పిటిషన్​లపై నేడు కూడా హైకోర్టులో వాదనలు జరిగాయి. ఇప్పటికే పరీక్ష కేంద్రాలను ప్రభుత్వం నిర్ణయించిందని.. పరీక్షను వాయిదా వేయాలని కోరుతూ కేవలం 150 మందే పిటిషన్​ వేశారని టీఎస్​పీఎస్సీ తెలిపింది. ఈ సందర్భంగా హైకోర్టుకు గ్రూప్​ 2 వాయిదా నిర్ణయాన్ని ఆగస్టు 14(సోమవారం)న చెబుతామని టీఎస్​పీఎస్సీ తెలిపింది.

TSPSC Group 2 Exam
TSPSC Group 2 Exam decision Conclude On August 14
author img

By

Published : Aug 11, 2023, 8:23 PM IST

TSPSC Clarity on Group 2 Exams Postpone : గ్రూప్-2 పరీక్ష వాయిదా వేయాలన్న వినతులపై ఆగస్టు 14(సోమవారం)న నిర్ణయం చెబుతామని హైకోర్టుకు రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్(TSPSC) తెలిపింది. ఇప్పటికే పరీక్షకు ఏర్పాట్లన్నీ పూర్తయ్యాయని టీఎస్​పీఎస్సీ వివరించింది. ఈ నెల 29, 30న తలపెట్టిన గ్రూప్-2(TSPSC Group2 Exam 2023) పరీక్ష వాయిదా వేయాలని కోరుతూ 150 మంది అభ్యర్థులు వేసిన పిటిషన్‌పై జస్టిస్ పి.మాధవీదేవి విచారణ చేపట్టారు. ఆగస్టు నెలలో గ్రూప్-2 సహా వేర్వేరు సిలబస్‌తో కూడిన 21 పోటీ పరీక్షలు ఉన్నాయని పిటిషనర్ల తరఫు న్యాయవాదులు గిరిధర్ రావు, నర్సింగ్ తెలిపారు. గ్రూప్-1, గ్రూప్-2 పరీక్షలు చాలా ముఖ్యమైనవన్నారు. గ్రూప్-2 పరీక్ష వాయిదా వేయాలని జూన్‌లోనే వినతిపత్రం ఇచ్చినప్పటికీ.. టీఎస్​పీఎస్సీ స్పందించడం లేదన్నారు.

నియామక పరీక్ష నిర్వహణ ప్రధాన ఉద్దేశం నెరవేరేలా టీఎస్​పీఎస్సీ వ్యవహరించడం లేదని వాదించారు. గ్రూప్-2 పరీక్షకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయని టీఎస్​పీఎస్సీ తరఫు న్యాయవాది రాంగోపాల్ రావు తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా 1,535 పరీక్ష కేంద్రాలు సిద్ధం చేశామని.. ఆ కేంద్రాలకు ప్రభుత్వం సెలవులు కూడా ప్రకటించిందన్నారు. గ్రూప్‌-2కి అయిదున్నర లక్షల మంది దరఖాస్తు చేసుకున్నారని.. వారిలో గురుకుల పరీక్షలు రాస్తున్నది సుమారు 60వేల అభ్యర్థులేనని పేర్కొన్నారు. కొందరే అయినా వారికీ అవకాశం ఉండాలి కదా అని హైకోర్టు వ్యాఖ్యానించింది.

Education Loan For Abroad Studies : ఎడ్యుకేషన్​ లోన్​ కావాలా?.. అయితే ఈ విషయాలు తెలుసుకోండి!

Telangana High Court TSPSC Group2 Case Status : లక్షల మంది దరఖాస్తు దారుల్లో పిటిషన్ వేసింది 150 మందేనని టీఎస్​పీఎస్సీ పేర్కొనగా.. కోర్టుకు అందరూ రాలేరని న్యాయమూర్తి వ్యాఖ్యానించారు. గ్రూప్‌-2 పరీక్ష వాయిదా వేయాలన్న అభ్యర్థుల వినతిపత్రంపై నిర్ణయం బుధవారం వరకు చెబుతామని టీఎస్పీఎస్సీ న్యాయవాది పేర్కొనగా.. చాలా మంది ఉత్కంఠగా ఎదురు చూస్తున్నందున సోమవారం చెప్పాలని న్యాయమూర్తి ఆదేశించారు.

Group-2 Candidates Petition in Telangana HighCourt : గ్రూప్-2 పరీక్ష వాయిదా వేయాలని హైకోర్టులో పిటిషన్

నాడు తెలంగాణ ఉద్యమంలో కేసులు.. నేడు సాధించుకున్న తెలంగాణలో కేసులు : మరోవైపు గ్రూప్​-2 పరీక్ష వాయిదా వేయాలని గురువారం నిరసన కార్యక్రమంలో పాల్గొని.. అరెస్టు అయి చంచల్​గూడ జైలు రిమాండ్​లో ఉన్న అశోక్​ను మూలాకత్​లో ఖైరతాబాద్​ డీసీసీ అధ్యక్షుడు రోహిత్​ రెడ్డి, ఎన్​ఎస్​యూఐ రాష్ట్ర అధ్యక్షుడు బలమూరి వెంకట్​ కలిశారు. ఈ సందర్భంగా బలమూరి వెంకట్​ మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి మొండి వైఖరితో లక్షలాది మంది నిరుద్యోగులు రోడ్డున పడ్డారని మండిపడ్డారు. సీఎం కేసీఆర్​కు నిరుద్యోగుల పట్ల చిత్తశుద్ధి ఉంటే వెంటనే గ్రూప్​-2 ఎగ్జామ్​ వాయిదా వేయాలన్నారు. నాడు తెలంగాణ ఉద్యమ సమయంలో అక్రమ కేసులు, నేడు సాధించుకున్న తెలంగాణలో కూడా అక్రమ కేసులే బనాయిస్తున్నారని విమర్శించారు. వెంటనే అశోక్​పై పెట్టిన అక్రమ కేసులు ఎత్తివేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్​ చేశారు.

Group-2 Candidates Protest Hyderabad : గ్రూప్‌-2 పరీక్షను వాయిదా వేయాలంటూ అభ్యర్థుల పోరుబాట

తెలంగాణ గ్రూప్- 2 పరీక్షల తేదీలు ప్రకటించిన టీఎస్‌పీఎస్సీ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.