ETV Bharat / state

టీఎస్‌పీఎస్సీ ఛైర్మన్, సభ్యుల బాధ్యతల స్వీకరణ - తెలంగాణ ప్రభుత్వం

టీఎస్​పీఎస్సీ కొత్త ఛైర్మన్​, సభ్యులు బాధ్యతలు స్వీకరించారు. కరోనా దృష్ట్యా నిరాడంబంరంగా కార్యక్రమాన్ని నిర్వహించారు. ఐఏఎస్​ అధికారి జనార్దన్​రెడ్డి సహా ఏడుగురు సభ్యులను ప్రభుత్వం నియమిస్తూ రెండురోజుల క్రితం ఉత్తర్వులు జారీ చేసింది.

tspsc-chairman-and-members-oath-taking
టీఎస్‌పీఎస్సీ ఛైర్మన్, సభ్యుల బాధ్యతల స్వీకరణ
author img

By

Published : May 21, 2021, 11:36 AM IST

రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ నూతన ఛైర్మన్‌గా బి.జనార్దన్ రెడ్డి సహా మరో ఏడుగురు సభ్యులు బాధ్యతలు స్వీకరించారు. ఉదయం 10.45 గంటలకు టీఎస్​పీఎస్సీ కార్యాలయంలో కరోనా నిబంధనలు పాటిస్తూ కార్యక్రమాన్ని నిర్వహించారు.

టీఎస్‌పీఎస్సీ ఛైర్మన్, సభ్యుల బాధ్యతల స్వీకరణ

మూడేళ్లపాటు జనార్దన్ రెడ్డి టీఎస్​పీఎస్సీ ఛైర్మన్​గా కొనసాగనున్నారు. ప్రభుత్వ మరో మూడేళ్లు పొడిగించే అవకాశం ఉంది. కమిషన్​ సభ్యులుగా రమావత్ ధన్​సింగ్, ఆచార్య బి.లింగారెడ్డి, కోట్ల అరుణకుమారి, సుమిత్రా ఆనంద్ తనోబా, కారెం రవీందర్​రెడ్డి, ఆరవెల్లి చంద్రశేఖర్​రావు, ఆర్.సత్యనారాయణలు బాధ్యతలు స్వీకరించారు. ఛైర్మన్, సభ్యుల నియామకంతో త్వరలోనే ఉద్యోగ నియామక ప్రక్రియ ప్రారంభమయ్యే అవకాశముందని భావిస్తున్నారు.

ఇదీ చూడండి: హైదరాబాద్‌ నుంచి విశాఖకు కొరియర్లో ‘రెమ్‌డెసివిర్‌’!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.