ETV Bharat / state

TS PGECET 2023 Counseling and Web Options : పీజీఈసెట్​ వెబ్​ ఆప్షన్స్ ప్రారంభం.. ఎలా నమోదు చేయాలో తెలుసా? - TS PGECET వెబ్ ఆప్షన్లు 2023 ముఖ్యమైన సూచనలు

Telangana PGECET 2023 Counseling : టీఎస్​ పీజీఈసెట్​ 2023 వెబ్​ ఆప్షన్ల నమోదు ప్రక్రియ ప్రారంభమైంది. మరి, వెబ్​ ఆప్షన్లు ఎలా నమోదు చేసుకోవాలి? ఆప్షన్లను ఎంచుకునే క్రమంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటీ??

Telangana PGECET 2023 Counseling
TS_PGECET_2023_Web_Options
author img

By Telangana

Published : Sep 2, 2023, 1:15 PM IST

TS PGECET 2023 Web Options: తెలంగాణలో ఎంటెక్‌, ఎంఫార్మసీ, ఎంఆర్క్‌ తదితర రెగ్యులర్​ కోర్సుల్లో ప్రవేశానికి సంబంధించిన వెబ్​ ఆప్షన్ల నమోదు ప్రక్రియ సెప్టెంబర్​ 1, 2023 నుంచి ప్రారంభమైంది. పోస్ట్ గ్రాడ్యుయేట్ ఇంజనీరింగ్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ (TS PGECET) అనేది.. ఇంజనీరింగ్, టెక్నాలజీ, ఆర్కిటెక్చర్, ఫార్మసీ (ME / M.Tech./ M.Pharmacy / M.Arch), గ్రాడ్యుయేట్ స్థాయిలలో రెగ్యులర్ PG కోర్సులలో ప్రవేశానికి తెలంగాణ రాష్ట్ర స్థాయి సాధారణ ప్రవేశ పరీక్ష.

తెలంగాణ స్టేట్ కౌన్సిల్ ఆఫ్ హయ్యర్ ఎడ్యుకేషన్ TS PGECET వెబ్ ఆప్షన్స్ లింక్‌ నమోదు ప్రక్రియను అధికారిక వెబ్‌సైట్‌లో pgecetadm.tsche.ac.in సెప్టెంబర్ 1, 2023 నుంచి అందుబాటులోకి తెచ్చింది. ముందుగా నిర్ణయించిన షెడ్యూల్ ప్రకారం అభ్యర్థులు తమ వెబ్ ఆప్షన్‌లను సెప్టెంబరు 2, 2023 వరకు ఉపయోగించుకునే అవకాశం ఉంటుంది. సెప్టెంబర్​ 3వ తేదీన ఆప్షన్లను తుది సవరణలు చేయడానికి వీలు కల్పిస్తారు. అభ్యర్థులు ఎంచుకున్న ఆప్షన్ల ఆధారంగా ఫేజ్ 1 అడ్మిషన్ కోసం జాబితాను సెప్టెంబర్ 6, 2023న విడుదల చేస్తారు.

TS PGECET వెబ్ ఆప్షన్స్ 2023ని ఎలా ఎక్సర్‌సైజ్ చేయాలి?..

How to Exercise TS PGECET Web Options 2023?..

  • TS PGECET అధికారిక వెబ్‌సైట్ 'pgecetadm.tsche.ac.in' ‌ని ఓపెన్​ చేయండి.
  • వెబ్‌సైట్ హోమ్‌పేజీలో 'వెబ్ ఆప్షన్‌లు(Web Options)' లేదా 'ఛాయిస్ ఫిల్లింగ్' పై క్లిక్ చేయండి.
  • హాల్ టికెట్ నెంబర్, ర్యాంక్ (PGECET)/, (GPAT), స్కోర్ (గేట్) మార్కులు వంటి లాగిన్
  • ఆధారాలను నమోదు చేసి.. ఆపై లాగిన్ బటన్‌పై క్లిక్ చేయాలి.
  • మీ కోర్సు ఆధారంగా.. కాలేజీలను ఎంపిక చేసుకోవాలి.
  • అనంతరం ఆప్షన్లను సేవ్ చేయాలి.

TS PGECET వెబ్ ఆప్షన్లు 2023 ముఖ్యమైన తేదీలు

TS PGECET Web Options 2023 Important Dates

  • వెబ్​ ఆప్షన్స్​ ఎక్సర్​సైజ్​- సెప్టెంబర్​ 1, 2023 నుంచి సెప్టెంబర్​ 2 , 2023
  • వెబ్​ ఆప్షన్ల సవరణ- సెప్టెంబర్​ 3, 2023
  • తాత్కాలికంగా ఎంపికైన అభ్యర్థుల జాబితా విడుదల- సెప్టెంబర్​ 6, 2023

TS PGECET వెబ్ ఆప్షన్లు 2023.. ముఖ్యమైన సూచనలు

TS PGECET Web Options 2023 Important Instructions: TS PGECET వెబ్ ఆప్షన్లను నమోదు చేసే విధానం ఆన్‌లైన్‌లో మాత్రమే ఉంటుంది. TS PGECET వెబ్ ఆప్షన్లకు 2023కి సంబంధించిన ముఖ్యమైన సూచనలు మీ కోసం..

  • TS PGECET ఫస్ట్​ ఫేజ్​ వెబ్ ఆప్షన్ రౌండ్‌లో పాల్గొనడానికి అభ్యర్థులు TS PGECET హాల్ టికెట్, ర్యాంక్ వంటి వారి లాగిన్ ఆధారాలను ఉపయోగించి లాగిన్‌ను పూర్తి చేయాలి.
  • GATE/GPAT ఆశించేవారు వారు సంబంధిత రిజిస్ట్రేషన్ ID, స్కోర్‌ను నమోదు చేయాలి.
  • అభ్యర్థులు ఒకటి కంటే ఎక్కువ పరీక్షలకు అర్హత సాధించినట్లయితే వారు రిజిస్టర్డ్ హాల్ టికెట్ నెంబర్‌తో మాత్రమే ఆప్షన్లను ఎంచుకోవాలి.
  • వెబ్ ఆప్షన్‌లను పరిశీలించిన తర్వాత అభ్యర్థులు సేవ్ చేసిన ఆప్షన్‌ల ప్రింటవుట్‌ను తీసుకుని దగ్గర పెట్టుకోవాలి.
  • వెబ్ ఆప్షన్ల సవరణ సమయంలో అభ్యర్థులు జాగ్రత్తగా వ్యవహారించాలి. ఒకసారి ఆప్షన్లను సబ్మిట్​ చేసిన తర్వాత ఎంపికలను సవరించడానికి తదుపరి అవకాశం ఉండదు.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.