ETV Bharat / state

పెట్టుబడులకు తెలంగాణ స్వర్గధామం: కేటీఆర్​ - ఇంటిగ్రేటెడ్ డిఫెన్స్ సిస్టం ఫెసిలిటీ ప్రొగ్రాం

పెట్టుబడులకు తెలంగాణ స్వర్గధామంగా మారిందని (Integrated Defence System Facility)ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. ముఖ్యంగా రక్షణ రంగంలో పెట్టుబడులు రావడం సంతోషకరమన్నారు. రాష్ట్రంలో రక్షణ, విమానయాన రంగంలో వేల కోట్ల పెట్టుబడులు పెట్టేందుకు అనేక సంస్థలు ఆసక్తి కనబరుస్తున్నాయన్నారు. రక్షణ రంగంలో వెమ్ టెక్నాలజీస్ (VEM technologies) సంస్థ వెయ్యి కోట్ల రూపాయలు పెట్టుబడులు పెట్టడం అభినందనీయమని మంత్రి కేటీఆర్ అన్నారు.

ktr
ktr
author img

By

Published : Oct 24, 2021, 10:47 PM IST

హైదరాబాద్ నగరంలో విమాన, రక్షణ రంగ పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తి కనబర్చడం సంతోకరమని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ అన్నారు. హైదరాబాద్​లోని ఓ ప్రైవేట్ హోటల్​లో 'ఇంటిగ్రేటెడ్ డిఫెన్స్ సిస్టం ఫెసిలిటీ' (Integrated Defence System Facility)కార్యక్రమానికి కేటీఆర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా తెలంగాణ ప్రభుత్వంతో వెమ్ టెక్నాలజీస్ సంస్థ పరస్పర అవగాహన ఒప్పందం చేసుకొంది.

రాష్ట్రంలో వెమ్ టెక్నాలజీస్ సంస్థ వెయ్యి కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టేందుకు ముందుకు రావడం అభినందనీయమన్నారు కేటీఆర్​. ఇక్కడ తయారవుతున్న వాటిని యూఎస్, యూరప్, ఇజ్రాయెల్​కూ ఎగుమతి చేస్తున్నామన్నారు. రాష్ట్రంలో అనేక విదేశీ సంస్థల పెట్టుబడులు రావడమే కాదు.. వాటికి తగ్గట్లుగా లక్షల కోట్ల విలువైన ఆర్డర్లూ వస్తున్నాయని మంత్రి కేటీఆర్ తెలిపారు. జహీరాబాద్​లో స్కిల్​ డెవలప్​మెంట్​ కేంద్రం ఏర్పాటు చేస్తున్నందుకు మంత్రి కేటీఆర్ సంతోషం వ్యక్తం చేశారు.

పెట్టుబడులకు తెలంగాణ స్వర్గధామం: కేటీఆర్​

'లార్జ్ ఇంటిగ్రేటెడ్ డిఫెన్స్‌ సిస్టంలో భాగంగా... తెలంగాణలో వెయ్యి కోట్ల పెట్టుబడులు పెట్టాలని నిర్ణయించిన వెమ్ టెక్నాలజీస్​కు కృతజ్ఞతలు, అభినందనలు తెలుపుతున్నాను. ఈ పెట్టుబడులతో రాష్ట్రంలో కొత్తగా 2 వేలకుపైగా ఉద్యోగాలు లభిస్తాయి. తెలంగాణమీద మీరు విశ్వాసం ఉంచినందుకు కృతజ్ఞతలు. ఏరోస్పేస్, డిఫెన్స్ ఎకోసిస్టం విలువను మరింత పెంచారు. రక్షణరంగానికి చెందిన అత్యున్నతమైన నిపుణులు హైదరాబాద్‌లో ఉన్నారు. ఈ రంగం అభివృద్ధికి మేము పూర్తి మద్దతు ఇస్తాం.'

- కేటీఆర్​, రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి

ఆత్మ నిర్భర్​ భారత్​, మేక్​ ఇన్​ ఇండియాలో భాగంగా అనేక సంస్థలు పెట్టుబడి పెట్టేందుకు ముందుకు వస్తున్నాయని డీఆర్​డీవో ఛైర్మన్​ సతీశ్​రెడ్డి పేర్కొన్నారు. డ్రోన్​ ఎంత ముఖ్యమో.. యాంటీ డ్రోన్​ సాంకేతికత అంతే ముఖ్యమన్నారు.

'యాంటీ డ్రోన్ రూపకల్పనలో హైదరాబాద్ కీలకభూమిక పోషిస్తుంది. ఒక్క ఫోన్ కాల్ చేస్తే చాలు రాష్ట్ర ప్రభుత్వం రక్షణ రంగానికి అవసరమైన ల్యాబ్స్ ఏర్పాటుకు కావాల్సిన అన్ని అనుమతులు వెనువెంటనే ఇచ్చింది. ముఖ్యంగా రక్షణ రంగంలో అనేక పెట్టుబడులు రావడం సంతోషకరం.'

- సతీశ్​​రెడ్డి, డీఆర్​డీవో ఛైర్మన్​

ఇదీచూడండి: Kishan reddy: 'కరోనా నియంత్రణ పరికరాల తయారీతో.. స్వయంసమృద్ధి దిశగా భారత్​'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.