ETV Bharat / state

TS Inter First Year Admission 2023 Registration Closed Today : అలర్ట్.. ఇంటర్ ప్రథమ సంవత్సరం ప్రవేశాలకు నేడే లాస్ట్ డేట్.! - తెలంగాణ ఇంటర్మీడియట్ బోర్డు తాజా వార్తలు

TS Inter First Year Admission Registration 2023 : ఇంటర్​ తొలి ఏడాది ప్రవేశానికి సంబంధించి తెలంగాణ ఇంటర్ బోర్డు అలర్ట్ ఇచ్చింది. ఇంటర్మీడియట్ ప్రథమ సంవత్సర ప్రవేశానికి ఇవాళే(అక్టోబర్ 9) చివరి తేదీగా పేర్కొంది. ఇంకా ఎవరైనా ప్రవేశం పొందకపోతే ఇప్పుడే సింపుల్​గా ఆన్​లైన్​లో ఇలా రిజిస్ట్రేషన్ చేసుకోండి.

TS Inter First Year Admission 2023 Registration Closed Today

author img

By ETV Bharat Telangana Team

Published : Oct 9, 2023, 3:25 PM IST

TS Inter First Year Admission Registration 2023 : తెలంగాణలో పదో తరగతి పాసై ఇంటర్మీడియట్​లో ప్రవేశాలు పొందడానికి అడ్మిషన్ రిజిస్ట్రేషన్ గడువును ఇంటర్​ బోర్డు పలుమార్లు పొడిగిస్తూ వచ్చిన విషయం తెలిసిందే. చివరి అవకాశంగా ఇంటర్ తొలి ఏడాది ప్రవేశానికి గడువును అక్టోబర్ 9 వరకు బోర్డు కల్పించింది. అంటే ఇవాళే ఇంటర్​ ప్రథమ సంవత్సరంలో చేరడానికి చివరి తేదీ. ఇంకా ఇప్పటి వరకు ప్రవేశాలు తీసుకోని వారు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని బోర్డు(Intermediate Board) కోరింది. మరోసారి 2023-24 సంవత్సరానికి సంబంధించి ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరంలో చేరడానికి అడ్మిషన్ రిజిస్టేషన్​ డేట్ పొడిగించబడదని పేర్కొంది.

TS Inter First Year Admission 2023 Registration Ends Today : ఇంకా ఎవరైనా 2023-24 సంవత్సరానికి సంబంధించి ఇంటర్​లో అడ్మిషన్ తీసుకోకపోతే ఇప్పుడే వెయ్యి రూపాయల ఆలస్య రుసుముతో ప్రథమ సంవత్సరానికి అప్లై చేసుకోవచ్చు. రూ. వెయ్యి ఆలస్య రుసుము మీరు ఏదైనా ప్రైవేట్ జూనియర్ కళాశాలలో(Private Junior Colleges) అడ్మిషన్ పొందడానికి చెల్లించాల్సి ఉంటుంది. అదే ఒకవేళ మీరు ప్రభుత్వ కళాశాలలో అందించే కోర్సులలో చేరాలనుకుంటే ఎలాంటి ఆలస్య రుసుము చెల్లించాల్సిన పని లేదు. అయితే ఇంటర్మీడియట్ బోర్డు గుర్తింపు ఉన్న కళాశాల్లోనే చేరాలని విద్యార్థులకు బోర్డు స్పష్టం చేసింది. గుర్తింపు పొందిని కాలేజీల జాబితానూ ఇంటర్ బోర్డు అధికారిక వెబ్​సైట్ టీఎస్​బీఐఈ(TSBIE)లో అందుబాటులో ఉంచింది.

Board Exam New Rules 2023 : ఇకపై ఏడాదికి 2సార్లు బోర్డ్​ ఎగ్జామ్స్​.. ఇంటర్​లో రెండు లాంగ్వేెజెస్​ నేర్చుకోవాల్సిందే!

Telangana Board of Intermediate Education 2023 : అయితే గతంలో మాదిరిగా ఇంటర్ ప్రథమ సంవత్సరంలో ప్రవేశం పొందడానికి మీరు ఎంచుకున్న కాలేజీకి వెళ్లి అడ్మిషన్ పొందాల్సిన అవసరం లేదు. మీరు ఉన్నచోటు నుంచే ఆన్​లైన్​లో చాలా సింపుల్​గా ఇంటర్మీడియట్ తొలి సంవత్సరంలో అడ్మిషన్ కోసం రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. అది ఎలాగో ఇప్పుడు చూద్దాం..

How to Apply for TS Inter 1st Year Admission Registration 2023 in Telugu :

తెలంగాణ ఇంటర్ మొదటి సంవత్సరం అడ్మిషన్ రిజిస్ట్రేషన్ కోసం అప్లై చేసుకోండిలా..

  • మొదట మీరు తెలంగాణ ఇంటర్ అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించాలి.
  • ఆ తర్వాత మీరు 'Intermediate 1st Year Admission 2023-24'అని కనిపించే లింక్‌పై క్లిక్ చేయాలి.
  • అప్పుడు ఓపెన్ అయిన పేజీలో ఎన్​రోల్​మెంట్​ కోసం మొదట జిల్లా & మండలాన్ని ఎంచుకోవాలి.
  • అనంతరం ఇంటర్ కళాశాలల జాబితా స్క్రీన్​పై కనిపిస్తుంది.
  • ఆ తర్వాత మీకు నచ్చిన కళాశాలను ఎంచుకోవాలి. ఆపై ఓపెన్ అయిన దరఖాస్తు ఫారమ్​ను ఫిల్ చేసి నమోదు ప్రక్రియను కొనసాగించాలి.
  • అనంతరం అవసరమైన అన్ని డాక్యుమెంటేషన్‌లను అప్‌లోడ్ చేయాలి.
  • చివరగా సమాచారాన్ని ఒకటికి రెండుసార్లు చెక్​ చేసి ఫారమ్‌ను సమర్పించాలి.
  • భవిష్యత్తు ఉపయోగం కోసం confirmation పేజీ కాపీని ప్రింట్ తీసుకోవాలి.
  • ఇలా సింపుల్​గా మీరు ఆన్​లైన్​లో ఇంటర్​ తొలి ఏడాది ప్రవేశానికి రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు.

SSC Jobs 2023 : ఇంటర్​ అర్హతతో.. ఎస్​ఎస్​సీలో 1207 స్టెనోగ్రాఫర్​ ఉద్యోగాలు!

Career After Intermediate Telangana : ఇంటర్ తర్వాత విద్యార్థుల పయనమెటు..?

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.