ETV Bharat / state

జూన్ 1 నుంచి ఇంటర్​ మొదటి సంవత్సరం ఆన్​లైన్ తరగతులు - inter admissions 2021

రాష్ట్రంలో ఇంటర్​ ప్రవేశాలకు షెడ్యుల్ విడుదలైంది. నేటి నుంచి జులై 5 వరకు మొదటి విడత ప్రవేశాలను చేపట్టనున్నట్లు బోర్డు కార్యదర్శి సయ్యద్ ఉమర్ జలీల్ వెల్లడించారు. మొదటి సంవత్సరం విద్యార్థులకు జూన్ 1 నుంచి ఆన్​లైన్ తరగతులను ప్రారంభించనున్నట్లు ప్రకటించారు.

inter-admissions-started
ఇంటర్ అడ్మిషన్లు ప్రారంభం
author img

By

Published : May 25, 2021, 8:19 PM IST

ఇంటర్​ ప్రథమ సంవత్సరం ప్రవేశాల షెడ్యూలును ఇంటర్​ బోర్డు ప్రకటించింది. నేటి నుంచి జులై 5 వరకు మొదటి విడత ప్రవేశాలను చేపట్టనున్నట్లు తెలిపింది. జూన్ 1 నుంచి మొదటి సంవత్సరం విద్యార్థులకు ఆన్​లైన్ తరగతులను ప్రారంభించనున్నట్లు.. బోర్డు కార్యదర్శి సయ్యద్ ఉమర్ జలీల్ వెల్లడించారు.

కళాశాలల్లో ఒక్కో సెక్షన్​కు.. 88 మంది విద్యార్థులకు మించి తీసుకోరాదని బోర్డు హెచ్చరించింది. విద్యార్థులు.. ప్రవేశాల ప్రక్రియలో ఆధార్ కార్డును తప్పనిసరిగా సమర్పించాల్సి ఉంటుందని తెలిపింది . ప్రభుత్వ, ప్రైవేటు, ఎయిడెడ్, గురుకుల, ఆదర్శ, కేజీబీవీ కళాశాలలన్నింటికీ నియమాలు వర్తిస్తాయని స్పష్టం చేసింది. బోర్డు అనుబంధ గుర్తింపు ఉన్న కళాశాలల్లోనే చేరాలని.. బోర్డు కార్యదర్శి జలీల్ కోరారు.

ఇదీ చదవండి: రాష్ట్రంలో మరో 3,821 కరోనా కేసులు, 23 మరణాలు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.