రాష్ట్రంలో ఆసరా పింఛన్ల పంపిణీ ఆలస్యం కావడంపై రాష్ట్ర మానవ హక్కుల సంఘం ఛైర్మన్ జస్టిస్ చంద్రయ్య అసహనం వ్యక్తం చేశారు. నిధులు లేకపోవడంతో రాష్ట్రంలోని కొన్ని జిల్లాలలో ఒక నెల జాప్యం కావడంతో మరుసటి నెలలో పంపిణీ చేయడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. దీని వల్ల రాష్ట్రంలోని 39. 41లక్షల లబ్ధిదారులు కొన్ని నెలలుగా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్నారు. ఈ సంఘటనపై రెండు వారాల్లోగా సమగ్ర విచారణ జరిపి నివేదిక సమర్పించాలని... ప్రభుత్వ ముఖ్యకార్యదర్శికి ఛైర్మన్ ఆదేశాలు జారీ చేశారు.
ఇదీ చూడండి: నగరంలో చీకటి పడితే చాలు గల్లీకో గాంధారి పుత్రుడు..