ETV Bharat / state

విద్యా సంవత్సరం ఖరారయ్యాకే సర్కారు మార్గదర్శకాలు - hyderabad latest news

విద్యా సంవత్సరం ఖరారయ్యాకే.. ఆన్​లైన్ తరగతులపై మార్గదర్శకాలు ప్రకటిస్తామని రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టుకు నివేదించింది. అనువైన విద్యా సంవత్సరం రూపొందించే పనిలో ఉన్నామని.. ఎప్పుడు ఖరారావుతుందో ఇప్పుడే ఏమీ చెప్పలేమని వెల్లడించింది. తల్లిదండ్రుల అభిప్రాయాలను సమర్పించేందుకు ఆగస్టు 5 వరకు సమయం ఇవ్వాలని కేంద్రాన్ని కోరినట్లు సర్కారు​ తెలిపింది.

ts govt gave a report to higcourt on school academic year 2020
విద్యా సంవత్సరం ఖరారయ్యాకే మార్గదర్శకాలు
author img

By

Published : Jul 22, 2020, 10:30 PM IST

పాఠశాల విద్యా సంవత్సరం ఎప్పుడు ప్రారంభమవుతుందో ఇప్పుడే ఏమీ చెప్పలేమని రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టుకు తెలిపింది. రాష్ట్రంలో కరోనా పరిస్థితులపై విద్యా సంవత్సరం ఆధారపడి ఉంటుందని వివరించింది. ప్రైవేట్ పాఠశాలల ఆన్​లైన్ తరగతులను నిషేధించాలని కోరుతూ హైదరాబాద్ స్కూల్ పేరెంట్స్ అసోసియేషన్ దాఖలు చేసిన ప్రజా ప్రయోజన వ్యాజ్యం విచారణలో భాగంగా రాష్ట్ర విద్యా శాఖ హైకోర్టుకు నివేదిక సమర్పించింది. కరోనా తీవ్రత కారణంగా దేశంలోని అనేక రాష్ట్రాల్లో ఇంకా విద్యా సంవత్సరం ఖరారు కాలేదని తెలిపింది. అందరికీ అనువైన విద్యా సంవత్సరాన్ని ఖరారు చేసేందుకు కసరత్తు చేస్తున్నట్లు పేర్కొంది.

కమిటీ ఏర్పాటు

అధ్యయనం చేసేందుకు విద్యా శాఖ అదనపు డైరెక్టర్లు, జాయింట్ డైరెక్టర్లతో ఇప్పటికే ఓ కమిటీ ఏర్పాటు చేసినట్లు వివరించింది. కమిటీ సిఫార్సుల ఆధారంగా ముసాయిదా నివేదిక కూడా సిద్ధమైందని.. నివేదికలో విద్యాశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి చిత్ర రామచంద్రన్ తెలిపారు. బడులు తెరిచే వరకు టీవీలు ఆన్​లైన్ పద్ధతిలో ప్రత్యామ్నాయ బోధన చేయాలని కమిటీ సిఫార్సు చేసిందని విద్యా శాఖ తెలిపింది. డిజిటల్ బోధనపై ఈనెల 14న జాతీయ విద్య పరిశోధన, శిక్షణ మండలి (ఎన్​సీఈఆర్​టీ) మార్గదర్శకాలు జారీ చేసిందని ప్రభుత్వం తెలిపింది.

నిపుణులతో చర్చించిన తర్వాతే నిర్ణయం

ఎన్​సీఈఆర్​టీ మార్గదర్శకాలపై విద్యారంగ నిపుణులతో చర్చించిన తర్వాతే రాష్ట్ర పాలసీపై తుది నిర్ణయం తీసుకోవాలని ఇటీవల ఉన్నత స్థాయి సమావేశంలో నిర్ణయించినట్లు ప్రభుత్వం వెల్లడించింది. విద్యార్థులు, తల్లిదండ్రులపై అదనపు ఆర్థిక భారం ఉండని బోధన పద్ధతులపై కసరత్తు చేస్తున్నట్లు తెలిపింది. ఆగస్టు లేదా సెప్టెంబరు లేదా అక్టోబరులో ఎప్పుడు బడులు ప్రారంభించాలని తల్లిదండ్రులు కోరుకుంటున్నారో తెలపాలని కేంద్ర ప్రభుత్వం కోరిందని తెలిపింది. తల్లిదండ్రుల ఫీడ్ బ్యాక్ సమర్పించాలని డీఈవోలను ఆదేశించినట్ల వివరించింది. తల్లిదండ్రుల అభిప్రాయాలు సమర్పించేందుకు కనీసం ఆగస్టు 5 వరకు సమయం ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరినట్లు విద్యా శాఖ వివరించింది. విద్యా సంవత్సరం, నిరంతర అభ్యాసం విధానంపై నిర్ణయం తీసుకున్న తర్వాతే.. ప్రైవేట్ పాఠశాలలు ఆన్ లైన్ బోధనలో ఎలాంటి విధి విధానాలు పాటించాలనే అంశంపై కచ్చితమైన మార్గదర్శకాలను జారీ చేస్తామని సర్కారు వెల్లడించింది.

ఇదీ చూడండి : ప్రభుత్వం ఐసీఎంఆర్ మార్గదర్శకాలను లెక్కచేయట్లేదు: రాంచందర్‌ రావు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.