భాగ్యనగరంలో ఇటీవల కురిసిన భారీ వర్షాలు, వరదల నేపథ్యంలో హుస్సేన్ సాగర్ పరిశీలనకు రాష్ట్ర ప్రభుత్వం.. కమిటీని ఏర్పాటు చేసింది. సాగర్‌కు సంబంధించిన నిర్మాణాల సామర్థ్యం, ప్రస్తుత పరిస్థితులను పరిశీలించేందుకు ఈ కమిటీని నియమించింది. నీటిపారుదల శాఖ ఇంజనీర్ ఇన్ చీఫ్ మురళీధర్ ఛైర్మన్‌గా ఏర్పాటు చేసిన ఈ కమిటీలో ఆర్‌అండ్‌బీ ఈఎన్సీ గణపతిరెడ్డి, సీడీఓ, జీహెచ్ఎంసీ, హెచ్ఎండీఏ చీఫ్ ఇంజనీర్లు, హైదరాబాద్ ఐఐటీ ప్రొఫెసర్లు, జలమండలి ఈడీ సభ్యులుగా ఉంటారు.
సాగర్‌కు సంబంధించిన నిర్మాణాల స్థిరత్వం, హైడ్రాలాజికల్ సంబంధింత అంశాలు, వరద వెళ్లే మార్గం, నిర్మాణాలకు మరమ్మతులు తదితరాలను పూర్తి స్థాయిలో కమిటీ పరిశీలించాలని ప్రభుత్వం పేర్కొంది. ప్రస్తుత పరిస్థితులు, భవిష్యత్‌లో ఎదురయ్యే సవాళ్లను దృష్టిలో ఉంచుకొని అన్ని అంశాలపై సమగ్ర నివేదిక ఇవ్వాలని ఆదేశించింది. ఈ మేరకు సీఎస్ సోమేశ్ కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు.
ఇదీ చదవండి: మట్టపల్లి వంతెన ప్రారంభం.. ఇక ప్రయాణాలు సులభం