నాగార్జునసాగర్‌లో జల విద్యుదుత్పత్తిని జెన్‌కో నిలిపివేసింది. ఉన్నతాధికారుల ఆదేశాలతో విద్యుదుత్పత్తిని ఆపివేశారు. గత నెల 29 నుంచి నాగార్జునసాగర్‌లో విద్యుదుత్పత్తి చేస్తున్నారు. 11 రోజుల్లో 30 మిలియన్ల యూనిట్ల కరెంట్‌ను జెన్‌కో ఉత్పత్తి చేసింది. ఈ వ్యవహారం తెలుగు రాష్ట్రాల మధ్య వివాదానికి దారి తీసింది. ప్రాజెక్టుల్లో నీళ్లు తక్కువగా ఉన్నా.. తెలంగాణ జల విద్యుత్ ఉత్పత్తి చేస్తోందని ఆంధ్రప్రదేశ్ కృష్ణా బోర్డుకు ఫిర్యాదు చేసింది.
నీళ్లన్నీ వృథాగా సముద్రంలోకి వెళ్తున్నాయని కృష్ణానదీ యాజమాన్య బోర్టుతో పాటు కేంద్ర జలశక్తి శాఖలకు లేఖలు రాసింది. విద్యుత్ ఉత్పత్తి నిబంధనల మేరకే చేస్తున్నామని తెలంగాణ స్పష్టం చేసింది. తమకు కేటాయించిన నీటి వాటాను వాడుకుంటున్నామని తేల్చి చెప్పింది. శ్రీశైలంలో గరిష్ఠ మట్టాలకు నీరు చేరకూడదనే తెలంగాణ విద్యుత్ ఉత్పత్తి చేస్తోందనేది ఆంధ్రప్రదేశ్ వాదిస్తోంది. రాయలసీమ ఎత్తిపోతల చేపట్టడంపై రాష్ట్ర ప్రభుత్వం అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. ఈ వివాదం సహా కృష్ణా జలాల కేటాయింపుపై ఈ నెల 24న కృష్ణానదీ యాజమాన్య బోర్టు పూర్తిస్థాయి సమావేశం జరిగే అవకాశం ఉంది.
WATER DISPUTES: కేసీఆర్‌కు కేంద్రజలశక్తి మంత్రి ఫోన్.. 'రాయలసీమ'కు కృష్ణాబోర్డు బృందం