ETV Bharat / state

TS Genco: విద్యుత్‌ ఉత్పత్తి శాతంలో దేశంలో తెలంగాణ జెన్​కో ముందంజ - telangana varthalu

TS Genco: విద్యుత్‌ కేంద్రాల ఉత్పత్తి శాతంలో గత ఆర్థిక సంవత్సరం(2021-22) దేశంలోని అన్ని రాష్ట్రాల విద్యుత్‌ సంస్థల కన్నా తెలంగాణ జెన్‌కో అగ్రస్థానంలో నిలిచిందని ఆ సంస్థ సీఎండీ ప్రభాకర్​ రావు ప్రకటించారు. అత్యధికంగా 73.87 శాతం పీఎల్‌ఎఫ్‌తో తెలంగాణ విద్యుదుత్పత్తి సంస్థ(జెన్‌కో) దేశంలోనే మొదటి స్థానంలో నిలిచిందని వెల్లడించారు.

TS Genco: విద్యుత్‌ ఉత్పత్తి శాతంలో దేశంలో జెన్​కో ముందంజ

author img

By

Published : Apr 2, 2022, 7:17 AM IST

TS Genco: విద్యుత్‌ కేంద్రాల ఉత్పత్తి శాతం(ప్లాంట్‌ లోడ్‌ ఫ్యాక్టర్‌-పీఎల్‌ఎఫ్‌)లో గత ఆర్థిక సంవత్సరం(2021-22) దేశంలోని అన్ని రాష్ట్రాల విద్యుత్‌ సంస్థల కన్నా తెలంగాణ జెన్‌కో అగ్రస్థానంలో నిలిచిందని ఆ సంస్థ సీఎండీ దేవులపల్లి ప్రభాకరరావు శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. రాష్ట్రంలోని అన్ని జెన్‌కో విద్యుత్‌ కేంద్రాల స్థాపిత ఉత్పాదక సామర్థ్యం 4000 మెగావాట్లు. ఇందులో అత్యధికంగా 73.87 శాతం పీఎల్‌ఎఫ్‌తో తెలంగాణ విద్యుదుత్పత్తి సంస్థ(జెన్‌కో) దేశంలోనే మొదటి స్థానంలో నిలిచింది. ఇదే పంథాలో 72 శాతంతో పశ్చిమ బంగాల్‌ రెండో స్థానం సాధించిందని సీఎండీ వివరించారు. ఒక్కో విద్యుత్‌ కేంద్రం వారీగా చూసినా దేశంలోని 800 మెగావాట్ల స్థాపిత సామర్థ్యంగల సూపర్‌ క్రిటికల్‌ యూనిట్లలో, కొత్తగూడెం ఏడో దశ ప్లాంటు 83.56 శాతం పీఎల్‌ఎఫ్‌తో తొలిస్థానంలో నిలిచింది. ఈ ప్లాంటులో ఆర్థిక సంవత్సరమంతా కలిపి 5,856 మిలియన్‌ యూనిట్ల(ఎంయూ) కరెంటును ఉత్పత్తి చేసింది. ఇక 2022 మార్చిలో ఏకంగా 596 ఎంయూల ఉత్పత్తితో 100 శాతం పీఎల్‌ఎఫ్‌ సాధించి కొత్త రికార్డు నమోదు చేసింది. కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ ఎన్టీపీసీ 70 శాతం విద్యుదుత్పత్తి సాధించింది. దేశంలో మొత్తం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల విద్యుత్‌ కేంద్రాలు, ప్రైవేటువన్నీ కలిపి సాధించిన సగటు పీఎల్‌ఎఫ్‌ 58 శాతం మాత్రమే. అంతకన్నా మిన్నగా విద్యుదుత్పత్తి చేసి రాష్ట్రంలో నిరంతర సరఫరాకు రాష్ట్ర జెన్‌కో ప్లాంట్లు ఎంతగానో తోడ్పడ్డాయని సీఎండీ ప్రభాకరరావు వివరించారు.

సీఎండీ దేవులపల్లికి కీలక పదవి: తెలంగాణ ట్రాన్స్‌కో-జెన్‌కో సీఎండీ దేవులపల్లి ప్రభాకరరావు మరో కీలక పదవిలో నియమితులయ్యారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరాని(2022-23)కి దక్షిణాది రాష్ట్రాల ప్రాంతీయ విద్యుత్‌ ఛైర్మన్‌గా ఆయనను నియమిస్తూ కేంద్ర విద్యుత్‌ మండలి శుక్రవారం ఉత్తర్వులు జారీచేసింది. దక్షిణాది రాష్ట్రాల్లో విద్యుత్‌ సరఫరా, పంపిణీ, లోడు నిర్వహణ వంటి అంశాలను ఈ కమిటీ పర్యవేక్షిస్తుంది. అన్ని రాష్ట్రాల విద్యుత్‌ సంస్థల సీఎండీలు ఇందులో సభ్యులుగా ఉంటారు.

మరో ప్లాంటు ప్రారంభించిన ఎన్టీపీసీ: కేరళలోని కయాంకుళంలో జలాలపై తేలియాడే 22 మెగావాట్ల సౌరవిద్యుత్‌ కేంద్రం శుక్రవారం వాణిజ్య ఉత్పత్తి ప్రారంభించినట్లు ఎన్టీపీసీ తెలిపింది. దీంతో కలిపి దక్షిణాదిలో ఇలాంటి విద్యుత్‌ కేంద్రాల స్థాపిత సామర్థ్యం ఇప్పటివరకూ 127 మెగావాట్లకు చేరినట్లు వివరించింది.

ఇదీ చదవండి: Invitation To KTR: మరో అంతర్జాతీయ సదస్సు నుంచి మంత్రి కేటీఆర్​కు ఆహ్వానం

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.