TS Genco Exams Postponed Today : తెలంగాణ విద్యుత్ ఉత్పత్తి సంస్థ (TSGENCO) అసిస్టెంట్ ఇంజినీర్ పోస్టుల రాత పరీక్షను వాయిదా వేసినట్లు యాజమాన్యం ప్రకటించింది. టీఎస్ జెన్కో అసిస్టెంట్ ఇంజినీర్ పోస్టుల భర్తీ కోసం అక్టోబర్ 4వ తేదీన నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ పోస్టులకు డిసెంబర్ 17వ తేదీన పరీక్ష నిర్వహించనున్నట్లు నోటిఫికేషన్లో పేర్కొంది. అదే రోజు ఇతర పోటీ పరీక్షలు ఉన్నందున జెన్కో నిర్వహించే ఏఈ రాత పరీక్షను వాయిదా వేయాల్సిందిగా పలువురు అభ్యర్థులు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.
ప్రజావాణికి పొటెత్తిన జనం- డబుల్ బెడ్‌రూం, భూ సమస్యలే అధికం
అలాగే ప్రజవాణిలో పెద్దసంఖ్యలో దరఖాస్తులు చేశారు. ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్కకు (Bhatti vikramarka) పలువురు అభ్యర్థులు విజ్ఞప్తి చేశారు. పరీక్ష నిర్వహణపై ప్రభుత్వం సమీక్ష నిర్వహించిన అనంతరం అభ్యర్థుల విజ్ఞప్తి మేరకు జెన్కో పరీక్షను వాయిదా వేసేందుకు ఉప ముఖ్యమంత్రి, విద్యుత్ శాఖ మంత్రి భట్టి విక్రమార్క అంగీరించారు. తదుపరి రాత పరీక్ష షెడ్యూల్‌ను www.tsgenco.co.in లో తెలియజేస్తామని యాజమాన్యం వెల్లడించింది.
టీఎస్‌పీఎస్సీ ఛైర్మన్ రాజీనామా - అశోక్‌నగర్‌లో నిరుద్యోగుల సంబురాలు
CM Revanth review on TSPSC : మరోవైపు టీెఎస్పీఎస్సీపై సీఎం రేవంత్‌రెడ్డి (CM Revanth reddy) సచివాలయంలో నిర్వహించిన సమీక్ష ముగిసింది. పబ్లిక్ సర్వీస్ కమిషన్ పరీక్షా పత్రాల లీకేజీ అంశానికి సంబంధించిన వివరాలు, కేసు పురోగతిని తెలుసుకున్నారు. తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఏర్పాటు, ఛైర్మన్ సహా సభ్యుల నియామకానికి సంబంధించిన అర్హతలు, ఇతర అంశాల గురించి ముఖ్యమంత్రి అధికారులతో ఆరా తీశారు.
పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఇప్పటి వరకు చేసిన నియామకాలు, మిగిలిన నియామకాల ప్రస్తుత స్థితి, పరీక్షల నిర్వహణ, సంబంధిత అంశాలపై అధికారుల నుంచి వివరాలు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీసుకున్నారు. గ్రూప్-1, ఏఈఈ, తదితర పరీక్షల ప్రశ్నాపత్రాల లీకేజీ గురించి తెలుసుకున్నారు. కేసు పురోగతి, ఇప్పటి వరకు జరిగిన విచారణ, తదుపరి కార్యాచరణ సహా అన్ని అంశాల గురించి పోలీసుల ఉన్నతాధికారుల ద్వారా సీఎం తీసుకున్నారు. ఇతర పరీక్షల తేదీలు, నిర్వహణ అంశం కూడా సమావేశంలో చర్చకు వచ్చినట్లు తెలిసింది. అన్ని అంశాలను పరిగణలోకి తీసుకొని పరిస్థితులకు అనుగుణంగా కమిషన్ తగిన నిర్ణయం తీసుకోవాలని సీఎం రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు.
యాదాద్రి ప్లాంట్ పర్యావరణ అనుమతుల జారీపై పీటముడి - ప్రజాభిప్రాయ సేకరణకు కేంద్రం ఆదేశం