హైదరాబాద్ గాంధీ భవన్‌లో కాంగ్రెస్ శ్రేణులు సంబురాలు చేసుకున్నారు. ఉత్తమ్, కోమటిరెడ్డి, రేవంత్రెడ్డి ఎంపీలుగా గెలుపొందడంపై ఆ పార్టీ నాయకులు, కార్యకర్తలు ఆనందం వ్యక్తం చేశారు. కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలుపుకున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో చేదు అనుభవం ఎదురైన తరువాత ఈ గెలుపు వారిలో నూతన ఉత్సాహాన్ని నింపింది. రాష్ట్రంలో హస్తం ఉనికి కాపాడుకోవడానికి సరైన సమయంలో ప్రజలు తీర్పు ఇచ్చారని ఆ పార్టీ శ్రేణులు అభిప్రాయపడుతున్నారు.
ఇదీ చూడండి : నేడు గాంధీభవన్లో కాంగ్రెస్ కీలక భేటీ