ETV Bharat / state

ఓఆర్​ఆర్​పై.. ట్రామా కేంద్రాలు ప్రారంభించనున్న సర్కారు - Outer ring Road

బాహ్య వలయ రహదారిపై ప్రమాదాల్లో గాయపడిన వారికి సత్వర చికిత్స అందించేందుకు గానూ.. రాష్ట్ర ప్రభుత్వం ట్రామా కేంద్రాలు, అంబులెన్స్ ​సర్వీసులు ప్రారంభించేందుకు సిద్ధమైంది. ఈ మేరకు ఏర్పాట్లన్ని సిద్ధం చేసింది. ట్రామా కేంద్రాలను మంత్రి కేటీఆర్ ప్రారంభించనున్నారు.

truama centers opens on outer ring road
ఓఆర్​ఆర్​పై.. ట్రామా కేంద్రాలు ప్రారంభించనున్న సర్కారు
author img

By

Published : Oct 17, 2020, 9:59 AM IST

బాహ్య వలయ రహదారిపై జరిగే ప్రమాదాల్లో క్షతగాత్రులు, బాధితులకు సత్వర చికిత్స అందించేందుకుగానూ.. రాష్ట్ర ప్రభుత్వం ట్రామా కేంద్రాలు, అంబులెన్స్​ సర్వీసులు ప్రారంభించనుంది. ప్రపంచ ట్రామా దినోత్సవం సందర్భంగా మంత్రి కేటీఆర్​ ఔటర్​ రింగురోడ్డులో ట్రామా కేంద్రాలు ప్రారంభించనున్నారు.

జీహెచ్​ఎంసీ చుట్టు ఉన్న ఔటర్​ రింగ్​రోడ్డులో గల 20 ఎగ్జిట్​ కేంద్రాల్లో.. రెండింటికి కలిపి ఒకటి చొప్పున పది ట్రామా కేంద్రాలు, అంబులెన్సులు ఏర్పాటు చేశారు. తక్షణ వైద్యచికిత్స అందేలా అవసరమైన అన్ని రకాల అత్యాధునిక ఉపకరణాలు ఈ అడ్వాన్స్​డ్ లైఫ్ సపోర్ట్ అంబులెన్స్​లలో ఉంటాయి. హెచ్ఎండీఏ ఆధ్వర్యంలో వీటిని నిర్వహిస్తారు. ప్రమాదాలు జరిగిన వెంటనే తక్షణ చికిత్స అందించడం ద్వారా ప్రాణాలను కాపాడవచ్చన్న ఉద్దేశంతో వీటిని ఏర్పాటు చేస్తున్నట్టు అధికారులు తెలిపారు.

ఇదీ చూడండి: 24 గంటల్లో కరెంట్ సరఫరా జరగాలి: కేటీఆర్ ఆదేశం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.