ETV Bharat / state

న్యాయమూర్తుల నియామకాల్లో సమ ప్రాధాన్యం కావాలి: వినోద్

author img

By

Published : Aug 24, 2019, 4:43 PM IST

రాష్ట్ర ప్రణాళిక బోర్డు ఉపాధ్యక్షుడిగా ఎన్నికైన వినోద్​ను న్యాయవాదులు తెలంగాణ భవన్​లో సన్మానించారు. ఈ సందర్భంగా హైకోర్టు న్యాయమూర్తుల నియామకాల్లో అన్ని సామాజిక వర్గాలకు తగిన ప్రాధాన్యం ఇవ్వాలని అభిప్రాయపడ్డారు. అరుణ్​జైట్లీ మరణంతో... దేశం ఓ మహానాయకుడిని కోల్పోయిందని వినోద్​ పేర్కొన్నారు.

జైట్లీ దేశానికి చేసిన సేవలు మరువలేనివి: వినోద్​

హైకోర్టు న్యాయమూర్తుల నియామకాల్లో అన్ని సామాజిక వర్గాలకు తగిన ప్రాధాన్యం ఇవ్వాలని రాష్ట్ర ప్రణాళిక బోర్డు ఉపాధ్యక్షుడు బి.వినోద్ కుమార్ అభిప్రాయపడ్డారు. రాజ్యాంగబద్ధమైన న్యాయస్థానాల్లో రిజర్వేషన్ల విధానం లేకపోయినప్పటికీ... సముచిత ప్రాధాన్యం ఉండాల్సిన అవసరం ఉందన్నారు. తెలంగాణ నుంచి సిఫార్సు అవుతున్న జాబితాలో అన్ని వర్గాలకు తగిన ప్రాధాన్యత లేకపోవడం బాధాకరమని వినోద్ వ్యాఖ్యానించారు. తెలంగాణ హైకోర్టులో న్యాయమూర్తులుగా తెలంగాణేతర న్యాయవాదులకు అవకాశం ఇవ్వడం కూడా మంచిది కాదన్నారు. ఈ విషయాలన్ని సుప్రీంకోర్టు, హైకోర్టు ప్రధాన న్యాయమూర్తుల దృష్టికి రాష్ట్ర ప్రభుత్వం తీసుకెళ్లక తప్పదని వినోద్ అన్నారు. రాష్ట్ర ప్రణాళిక బోర్డు ఉపాధ్యక్షుడిగా వినోద్ నియమితులైన సందర్భంగా న్యాయవాదులు తెలంగాణ భవన్​లో ఆయనను సన్మానించారు. హైకోర్టులో న్యాయమూర్తుల సంఖ్య 42కి పెంచాలని ఇప్పటికే ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా లేఖ రాశారని గుర్తు చేశారు.

దేశం ఓ మహానాయకుడిని కోల్పోయింది: వినోద్​

అరుణ్ జైట్లీ మరణంతో... దేశం ఓ మహానాయకుడిని కోల్పోయిందని వినోద్ పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావానికి లోక్ సభలో సుష్మా స్వరాజ్ సహకరించినట్లుగానే.. రాజ్యసభలో అరుణ్ జైట్లీ సహకరించారని గుర్తు చేసుకున్నారు. బిల్లుకు సవరణలను ప్రతిపాదించిన అరుణ్ జైట్లీ... కేసీఆర్ కోరగానే వాటిని ఉపసంహరించుకొని రాజ్యసభలో ఆమోదానికి మార్గం సులువు చేశారన్నారని చెప్పారు. తెలంగాణ రాష్ట్రానికి కూడా ఆర్థిక మంత్రిగా అరుణ్ జైట్లీ పలు సందర్భాల్లో సహకరించారన్నారు. తెలంగాణతో పాటు దేశానికి జైట్లీ చేసిన సేవలు మరవలేనివని వినోద్ అన్నారు.

ఇవీ చూడండి: అరుణ్​ జైట్లీ మృతిపట్ల ప్రముఖుల దిగ్భ్రాంతి

sample description
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.