ETV Bharat / state

TRS Plenary 2022: తెరాస ప్లీనరీ వేదికగా 13 తీర్మానాలు ఇవే..

TRS Plenary 2022 resolutions: ఉద్యమ పార్టీగా ఆవిర్భవించి... సుమారు ఎనిమిదేళ్లు నిరాటంకంగా పాలన కొనసాగిస్తున్న తెలంగాణ రాష్ట్ర సమితి.. యవ్వన దశకు చేరింది. తెరాస 21వ వ్యవస్థాపక దినోత్సవాన్ని హైదరాబాద్‌లోని హెచ్​ఐసీసీలో ప్లీనరీ ప్రారంభమైంది. ఈ ప్లీనరీ వేదికగా 13 తీర్మానాలు చేయనున్నారు.

TRS Plenary 2022
TRS Plenary 2022
author img

By

Published : Apr 27, 2022, 9:47 AM IST

Updated : Apr 27, 2022, 11:13 AM IST

TRS Plenary 2022 resolutions:

ప్లీనరీ వేదికగా 13 తీర్మానాలు

  1. యాసంగిలో వరి ధాన్యాన్ని కేంద్రం కొనుగోలు చేయక పోయినా రాష్ట్ర ప్రభుత్వమే కొనుగోలు చేస్తున్నందుకు అభినందన తీర్మానం
  2. దేశం విస్తృత ప్రయోజనాల రీత్యా జాతీయ రాజకీయాల్లో తెరాస పార్టీ కీలక భూమిక పోషించాలని రాజకీయ తీర్మానం
  3. ఆకాశాన్నంటిన ధరలు పెంచుతూ పేద మధ్యతరగతి ప్రజల మీద మోయలేని భారం వేస్తున్న కేంద్ర ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ ధరల నియంత్రణను డిమాండ్ చేస్తూ తీర్మానం
  4. చట్టసభల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్ బిల్లును పార్లమెంట్​లో ఆమోదింప చేసి అమలు చేయాలని డిమాండ్ చేస్తూ తీర్మానం
  5. భారతదేశ సామరస్య సంస్కృతిని కాపాడుకోవాలని మతోన్మాదానికి వ్యతిరేకంగా పోరాడాలని తీర్మానం
  6. బీసీ వర్గాలకు కేంద్ర ప్రభుత్వంలో బీసీ సంక్షేమ మంత్రిత్వశాఖ ఏర్పాటు చేయాలని బీసీ వర్గాల జనగణన జరపాలని డిమాండ్ చేస్తూ తీర్మానం
  7. తెలంగాణ రాష్ట్ర సామాజిక పరిస్థితులకు అనుగుణంగా రిజర్వేషన్ శాతం పెంచాలని కేంద్రాన్ని డిమాండ్ చేస్తూ తీర్మానం
  8. రాష్ట్రాల ఆదాయానికి గండి కొడుతూ కేంద్రం పన్నుల రూపంలో కాకుండా సెస్​ల రూపేణా వసూలు చేయడం మానుకోవాలని డివిజబుల్ పూల్​లోనే పన్నులు వసూలు చేయాలని తీర్మానం
  9. నదీ జలాల వివాద చట్టం సెక్షన్-3 ప్రకారం కృష్ణా జలాల్లో వాటాపై ట్రిబ్యునల్‌కు రిఫర్ చేయాలని డిమాండ్‌ చేస్తూ తీర్మానం
  10. భారత రాజ్యాంగం ప్రతిపాదించిన సమాఖ్య విలువలను కాలరాస్తున్న కేంద్ర ప్రభుత్వ అప్రజాస్వామిక వైఖరికి వ్యతిరేకంగా పోరాడాలని పిలుపునిస్తూ తీర్మానం
  11. తెలంగాణ రాష్ట్రంలో నవోదయ విద్యాలయాలను వైద్య కళాశాలలను వెంటనే ఏర్పాటు చేయాలని కేంద్రాన్ని డిమాండ్ చేస్తూ తీర్మానం
  12. చేనేత వస్త్రాలపై జీఎస్టీ రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ తీర్మానం
  13. దళితబంధు పథకాన్ని దేశవ్యాప్తంగా అమలు చేయాలని తీర్మానం

Last Updated : Apr 27, 2022, 11:13 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.