గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల నామినేషన్లకు శుక్రవారం చివరిరోజు కావడంతో.. హైదరాబాద్ ఐఎస్ సదన్ డివిజన్ తెరాస అభ్యర్థి సామ స్వప్న సుందర్ రెడ్డి ర్యాలీ నిర్వహించారు. ఈ ప్రదర్శనలో తెలంగాణ రాష్ట్ర సీనియర్ తెరాస నాయకులు, కార్యకర్తలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. సింగరేణి కాలనీ చంపాపేట్ పలు కాలనీల్లో బైక్, ఆటోలతో ర్యాలీ నిర్వహించారు.
సైదాబాద్ డివిజన్లోని టి.ఆర్.ఎస్ పార్టీ అభ్యర్థి సింగిరెడ్డి స్వర్ణలత రెడ్డి పెద్ద సంఖ్యలో కార్యకర్తలతో ర్యాలీగా వెళ్లి నామినేషన్ దాఖలు చేశారు. స్వర్ణలత రెడ్డి భర్త సింగిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి గత సంవత్సరం క్రితం అనారోగ్యంతో మృతి చెందారు. ఆయన ఫోటోతో ఆమె ర్యాలీలో పాల్గొన్నారు.
ఇవీ చదవండి: బండి సంజయ్ ఆరోపణలను ఖండించిన మంత్రి కేటీఆర్