ETV Bharat / state

Palla Rajeshwar Reddy: 'భాజపా నేతలు రాష్ట్రంలో కాదు... దిల్లీలో ధర్నా చేయండి' - హైదరాబాద్​ జిల్లా వార్తలు

భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌పై తెరాస ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్​రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. కనీసం సమాచారం లేని వ్యక్తి ఒక జాతీయ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్నారని ఎద్దేవా చేశారు. భాజపా ఎన్ని అడ్డంగులు సృష్టించినా రాష్ట్ర ప్రభుత్వం ధాన్యం కొనుగోలు చేస్తోందని తెలిపారు. ఇప్పటికే 3,500 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేశామని స్పష్టం చేశారు. యాసంగి ధాన్యం కొనుగోళ్లు కేంద్రం చేతుల్లోనే ఉందని తెలిపారు.

Palla
Palla
author img

By

Published : Nov 11, 2021, 12:56 PM IST

Updated : Nov 11, 2021, 2:10 PM IST

తెలంగాణ రైతులపట్ల రాష్ట్ర భాజపా నేతలకు చిత్తశుద్ధి ఉంటే రాష్ట్రంలో కాదు... దిల్లీలో ధర్నాలు చేయాలని తెరాస ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్​రెడ్డి డిమాండ్​ చేశారు. రైతుల సంక్షేమం కోసం సీఎం కేసీఆర్​ నిరంతరం కృషి చేస్తున్నారని తెలిపారు. భాజపా ఎన్ని అడ్డంగులు సృష్టించినా ధాన్యం కొనుగోలు ఆపలేరని తెలిపారు. రాష్ట్రంలో నిరంతరం ధాన్యం కొనుగోళ్ల ప్రక్రియం కొనసాగుతోందని పేర్కొన్నారు. ఇప్పటికే 3,500 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేశామని స్పష్టం చేశారు. ఎప్పటికప్పుడు రైతులకు చెల్లింపులు కూడా చేస్తున్నామని తెలిపారు.

రాష్ట్ర భాజపా నేతలు వరి పండించాలని చెబుతున్నారని.. కానీ ధాన్యం కొనుగోలు చేయబోమని కేంద్రం చెబుతోందని మండిపడ్డారు. యాసంగి ధాన్యం కొనుగోళ్లు.. కేంద్రం చేతుల్లోనే ఉందని తెలిపారు. కనీసం సమాచారం లేని బండి సంజయ్‌ ఒక జాతీయ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్నారని ఎద్దేవచేశారు. ధాన్యం కొనుగోళ్లపై కేంద్ర వైఖరికి నిరసనగా అన్ని నియోజకవర్గ కేంద్రాల్లో ఈ నెల 12న ధర్నా చేస్తామని తెలిపారు.

రాష్ట్రంలో వానాకాల పంట కొనుగోళ్ల ప్రక్రియ కొనసాగుతోంది. యాసంగి ధాన్యం కొనుగోళ్లు కేంద్రం చేతుల్లో ఉంది. ఎఫ్‌సీఐ ద్వారా కేంద్రం కొనాలి. అయితే వచ్చే యాసంగిలో పంట వేయాలా వద్దా? ఇది మా తెలంగాణ రైతుల ప్రశ్న. గత సంవత్సరం మేము 1.41 కోట్ల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని ఎఫ్‌సీఐకి అమ్మాము. కేంద్ర ప్రభుత్వ మార్కెట్లు రద్దు చేయాలని చట్టం తెచ్చినా మేము ధాన్యం కొన్నాం. రైతులపట్ల రాష్ట్ర భాజపా నేతలకు చిత్తశుద్ధి ఉంటే రాష్ట్రంలో కాదు... దిల్లీలో ధర్నాలు చేయాలి. ఈ రోజు భాజపా నేతలు చేసే ధర్నాలో ఒక్కరు కూడా రైతు లేడు. మీరు పూర్తిగా జ్ఞానం లేని కార్యకర్తలను తయారు చేస్తున్నారు.- పల్లా రాజేశ్వర్​రెడ్డి, తెరాస ఎమ్మెల్సీ

రాష్ట్రంలో వానాకాల పంట కొనుగోళ్ల ప్రక్రియం కొనసాగుతోంది

ఇదీ చదవండి: Minister Gangula: పోరాడి రాష్ట్రం సాధించాం.. రైతులకు న్యాయం చేయలేమా?

Last Updated : Nov 11, 2021, 2:10 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.