Kavitha Tweet: ఏపీ విభజనపై రాజ్యసభ వేదికగా ప్రధాని చేసిన వ్యాఖ్యలు.. తెలంగాణలో ఇంకా రాజకీయ వేడిని రగులుస్తూనే ఉన్నాయి. రోజు ఎవరో ఒకరు.. ఏదో రూపంలో ప్రధాని వ్యాఖ్యలపై స్పందిస్తూనే ఉన్నారు. కాంగ్రెస్‌ను విమర్శిస్తే.. తెరాస నేతలు ఎందుకు స్పందిస్తున్నారంటూ... ప్రధాని వ్యాఖ్యలను భాజపా సమర్థిస్తుండగా.. కాంగ్రెస్, తెరాస మాత్రం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ప్రధాని క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేస్తూ.. తెరాస మండల స్థాయి నుంచి రాష్ట్రస్థాయి వరకూ తీవ్ర నిరసనలు సైతం చేసింది. కాంగ్రెస్ సైతం ఆందోళనలు చేపట్టింది.
తాజాగా ఎమ్మెల్సీ కవిత స్పందించారు. కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల బాధ్యుడు మాణిక్కం ఠాగూర్ ట్వీట్‌ను ఖండిస్తూ కవిత ట్వీట్ చేశారు. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం ఎవరి భిక్షా కాదని స్పష్టం చేశారు. తెరాస నాయకత్వంలో.. ప్రజలు పోరాడి సాధించుకున్నారన్నారు. కేసీఆర్ నేతృత్వంలో జరిగిన పోరాటంలో చివరికి సత్యమే గెలిచిందన్నారు.
మాజీ ప్రధాని, కాంగ్రెస్ పార్టీ నాయకత్వాన్ని భాజపా అవమానిస్తే.. రాజకీయాలకు అతీతంగా కేసీఆర్ మద్దతుగా నిలబడ్డారని కవిత పేర్కొన్నారు. రాహుల్ గాంధీపై.. భాజపా వ్యాఖ్యలను ఎదుర్కోవడంలో కాంగ్రెస్ వెనకబడినప్పుడు.. కేసీఆర్ అండగా నిలిచారన్నారు. రాజకీయాల్లో హుందాతనం కోసం కేసీఆరే తొలుత స్పందించారని.. కవిత స్పష్టం చేశారు. రాజకీయ ప్రేరేపిత ఆరోపణలు చేసే ముందు ఆలోచించాలని మాణిక్కం ఠాగూర్‌ను కవిత సూచించారు.
-
Just setting the record state Manickam Ji once and for all.
— Kavitha Kalvakuntla (@RaoKavitha) February 14, 2022 " class="align-text-top noRightClick twitterSection" data="
KCR Garu and TRS Party led people’s movement for Telangana, it was not a GIFT. It was a FIGHT and TRUTH won. https://t.co/T1N8ru9dnv
">Just setting the record state Manickam Ji once and for all.
— Kavitha Kalvakuntla (@RaoKavitha) February 14, 2022
KCR Garu and TRS Party led people’s movement for Telangana, it was not a GIFT. It was a FIGHT and TRUTH won. https://t.co/T1N8ru9dnvJust setting the record state Manickam Ji once and for all.
— Kavitha Kalvakuntla (@RaoKavitha) February 14, 2022
KCR Garu and TRS Party led people’s movement for Telangana, it was not a GIFT. It was a FIGHT and TRUTH won. https://t.co/T1N8ru9dnv
అసలు మాణిక్కం ఠాగూర్ ఏమన్నారంటే..
అంతకుముందు తెరాస, భాజపాను విమర్శిస్తూ మాణిక్కం ఠాగూర్ ట్వీట్ చేశారు. లక్షల మంది తెలంగాణ యువకుల ఆకాంక్షలు, సోనియమ్మ సూచనలకనుగుణంగా పనిచేస్తామన్నారు. గత ఏడేళ్లలో జరగనిది ప్రస్తుతం జరుగుతోందని.. పార్టీ డిజిటల్ మెంబర్‌షిప్‌ను ఉద్దేశించి ట్వీట్లో పేర్కొన్నారు. ఊసరవెల్లి లాంటి తెరాస, మతోన్మాద పార్టీ భాజపాను ఓడించాల్సిన అవసరం ఉందన్నారు. ఆ పని కాంగ్రెస్ పార్టీ మాత్రమే చేయగలదన్నారు. తెరాస, భాజపాలు ఒకే నాణేనికి ఉన్న రెండు ముఖాలు వంటివని మాణిక్కం ఠాగూర్ విమర్శించారు.
-
Team @INCTelangana will continue to work for a Telangana,
— Manickam Tagore .B🇮🇳✋மாணிக்கம் தாகூர்.ப (@manickamtagore) February 14, 2022 " class="align-text-top noRightClick twitterSection" data="
Which millions of Telangana youth wanted..which SoniaAmma wanted..
In 7 years it never happened..to make that happen,we need to defeat the Chameleon TRS & Communal BJP.Both are 2 sides of the same coin.Congress can &will👍 https://t.co/NQlwoMxf22
">Team @INCTelangana will continue to work for a Telangana,
— Manickam Tagore .B🇮🇳✋மாணிக்கம் தாகூர்.ப (@manickamtagore) February 14, 2022
Which millions of Telangana youth wanted..which SoniaAmma wanted..
In 7 years it never happened..to make that happen,we need to defeat the Chameleon TRS & Communal BJP.Both are 2 sides of the same coin.Congress can &will👍 https://t.co/NQlwoMxf22Team @INCTelangana will continue to work for a Telangana,
— Manickam Tagore .B🇮🇳✋மாணிக்கம் தாகூர்.ப (@manickamtagore) February 14, 2022
Which millions of Telangana youth wanted..which SoniaAmma wanted..
In 7 years it never happened..to make that happen,we need to defeat the Chameleon TRS & Communal BJP.Both are 2 sides of the same coin.Congress can &will👍 https://t.co/NQlwoMxf22
ఇదీచూడండి: విభజన తీరుతో ఏపీ, తెలంగాణ ఇప్పటికీ నష్టపోతున్నాయి: మోదీ