ETV Bharat / state

TRS: 'నోటి దురుసుతనాన్ని ప్రదర్శించేందుకే ఇంద్రవెల్లి సభ' - Telangana news

పీసీసీ అధ్యక్షుడు రేవంత్​రెడ్డిపై తెరాస ఎమ్మెల్యేలు విమర్శలు ఎక్కుపెట్టారు. తన నోటి దురుసుతనాన్ని ప్రదర్శించేందుకే ఇంద్రవెల్లిలో సభను పెట్టుకున్నారని మండిపడ్డారు.

Trs mlas
రేవంత్​రెడ్డిపై తెరాస ఎమ్మెల్యేలు
author img

By

Published : Aug 10, 2021, 4:03 PM IST

TRS: 'నోటి దురుసుతనాన్ని ప్రదర్శించేందుకే ఇంద్రవెల్లి సభ'

పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి (Revanth Reddy) నోటి దురుసుతనాన్ని ప్రదర్శించేందుకే ఇంద్రవెల్లి సభ (Indravelli Sabha)ను పెట్టుకున్నారని తెరాస ఎమ్మెల్యేలు (Trs Mla's) చిరుమర్తి లింగయ్య, సైదిరెడ్డి ధ్వజమెత్తారు. సీఎం కేసీఆర్​పై రేవంత్ వాడిన భాషకు కాంగ్రెస్ నేతలే సిగ్గు పడుతున్నారని... ప్రజలు తగిన శాస్తి చేస్తారన్నారు. ఎంపీగా గౌరవ భాష మాట్లాడాలన్నారు. దళితులను చిన్నచూపు చూసే రేవంత్​ను తెలంగాణ సమాజం సహించదన్నారు.

దళిత, బీసీ, మైనారిటీలకు అమలవుతున్న కార్యక్రమాలను రేవంత్ రెడ్డి జీర్ణించుకోలేక పోతున్నారని తెరాస ఎమ్మెల్యేలు మండిపడ్డారు. దళిత బంధు పథకమంటే రేవంత్ రెడ్డికి కడుపు మంట ఎందుకన్నారన్నారు. కేసీఆర్ ప్రోత్సాహంతోనే గురుకులాలకు సేవలందించిన ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే సహించేది లేదన్నారు

చీకటి ఒప్పందం...

భాజపాతో చీకటి ఒప్పందం చేసుకొని కాంగ్రెస్ పార్టీ ఇంద్రవెల్లి సభ నిర్వహించిందని మాజీ మంత్రి జోగు రామన్న ఆరోపించారు. రేవంత్ రెడ్డి రెండు సార్లు భాజపా ఎంపీని కలిశారన్నారు. కాంగ్రెస్, భాజపాలకు బుద్ధి చెప్పే రోజులు ఎంతో దూరంలో లేవన్నారు. గిరిజనుల సంస్కృతి, పండగలను ఏనాడూ పట్టించుకోని కాంగ్రెస్ పార్టీ... దెయ్యాలు వేదాలు వల్లించినట్లు మాట్లాడుతోందని జోగు రామన్న విమర్శించారు.

మేము ఒకటే స్పష్టంగా అడగదలుకున్నం మీరు దళితబంధుకు వ్యతిరేకమా? మీరు దళితబంధుకు వ్యతిరేకమైతే డైరెక్ట్​గా చెప్పండి. ఆదివాసీ బంధు పెట్టమని మీరెవరు చెప్పెటోళ్లు. మాకో ప్రణాళిక ఉంది. అట్టడుగున ఉన్న కూలాలేంటి అనేవి మాకు తెలుసు. అందుకొరకే మీరు ఏమైనా పెట్టేదుంటే మీరు మీ రాష్ట్రాల్లో పెట్టండి. ఇక్కడ మేం అమలు చేస్తున్న పథకాలు మీరు మీ రాష్ట్రాల్లో కూడా పెట్టండి. నీ మాటలను బట్టి చూస్తే కాంగ్రెస్ పార్టీని పూర్తిగా భూస్థాపితం చేసేలా ఉన్నావు.

-- జోగు రామన్న, మాజీ మంత్రి

దళిత, గిరిజన, ఆదివాసీ కుటుంబాలకు కేసీఆర్ వెలుగునిచ్చారన్నారు. ఇంద్రవెల్లి సభలో రేవంత్ రెడ్డి నిజస్వరూపం బయట పడిందని.. 40 ఏళ్ల క్రితం కాంగ్రెస్ ప్రభుత్వం కాల్పుల్లో మరణించిన ఆదివాసీలకు కనీసం క్షమాపణ చెప్పలేదని ఎమ్మెల్సీ పురాణం సతీశ్​ అన్నారు. కుమురం భీం, జోడేఘాట్ స్థూపానికి ప్రాధాన్యమిచ్చింది కేసీఆరేనన్నారు. దళితబంధు పథకాన్ని రేవంత్ రెడ్డి జీర్ణించుకోలేక పోతున్నారని పురాణం ఆరోపించారు. కవిత, సంతోశ్​కుమార్, ఇంద్రకరణ్ రెడ్డి, బాల్క సుమన్​లను విమర్శించే హక్కు రేవంత్​కు లేదని ధ్వజమెత్తారు.

ఇవీ చూడండి:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.