TRS MLA Rohit Reddy on ED notices: ఇవాళ ఉదయం ఈడీ నోటీసు ఇచ్చిందని తాండూరు ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి పేర్కొన్నారు. ఈడీ నోటీసు ఆశ్చర్యంగా , విచిత్రంగా ఉందని వెల్లడించారు. నోటీసులో తన బయోడేటా అడగటం హాస్యాస్పదమన్నారు. తనకు నోటీసు వస్తుందని ముందే బండి సంజయ్‌కు ఎలా తెలుసని ప్రశ్నించారు. బీజేపీ బండారం బయట పెట్టినందుకే కక్ష పూరితంగా ఈడీ నోటీసులిచ్చిందని ఆరోపించారు.
న్యాయవాదులతో చర్చించి నోటీసుపై తగిన సమాధానం ఇస్తా. బండి సంజయ్‌కి ముందే ఎలా తెలుసో సిట్టింగ్ జడ్జితో విచారణ జరపాలి. బెంగళూరు డ్రగ్స్ కేసులో నాకు నోటీసు ఎప్పుడొచ్చిందో బండి చెప్పాలి. అయ్యప్ప మాలతో నేను యాదగిరిగుట్టకు వస్తా. తడి బట్టలతో బండి సంజయ్ యాదగిరిగుట్టకు రావాలి. బీఎల్ సంతోష్ తప్పు చేయకపోతే విచారణకు ఎందుకు రావట్లేదు. నీతిమంతులైతే బీఎల్ సంతోష్, తుషార్ విచారణకు రావాలి. - పైలట్ రోహిత్ రెడ్డి, తాండూరు ఎమ్మెల్యే
ఇక రోహిత్ రెడ్డికి ఉదయం ఈడీ సమన్లు జారీ చేసిన విషయం తెలిసిందే. ఈ నెల 19వ తేదీన విచారణ హాజరు కావాలని నోటీసులు ఇచ్చింది. రోహిత్ రెడ్డి వ్యాపార, ఆర్థిక లావాదేవీలపై ఈడీ విచారణ జరపనుంది. ఈడీ నుంచి నోటీసులు అందాయని పైలట్ రోహిత్ రెడ్డి నిర్ధారించారు.
ఇవీ చూడండి: