హైదరాబాద్ గన్ పార్క్‌లోని అమరవీరుల స్థూపాన్ని తెరాస నాయకులు(Trs Leaders At Gunpark).. గోమూత్రంతో శుద్ధి చేశారు. తెలంగాణ ఉద్యమంలో ఒక్కరోజు కూడా రేవంత్ రెడ్డి(revanth reddy) పాల్గొనలేదని తెరాస నాయకులు ఆరోపించారు. గన్ పార్కులోని (gun park)అమరవీరుల స్థూపం వద్ద ఆందోళన నిర్వహించారు.
నిన్న పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి రాకతో పవిత్రమైన అమరవీరుల స్థూపం మలినమైందని తెరాస యువజన విభాగం నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. అనంతరం స్థూపానికి పాలాభిషేకం నిర్వహించారు. కాంగ్రెస్‌కు(congress) వ్యతిరేకంగా పెద్దఎత్తున నినాదాలు చేశారు.
రాష్ట్ర ఉద్యమంలో ఒక్కరోజు కూడా పాల్గొనని రేవంత్ రెడ్డికి అమరవీరుల స్థూపం వద్దకు వచ్చే అర్హత లేదని తెరాస నాయకులు(Trs Leaders At Gunpark) మండిపడ్డారు. సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్‌పై అనుచిత వ్యాఖ్యలు చేస్తే సహించేది లేదని వారు హెచ్చరించారు. ఓటుకు నోటు కేసులో దొరికిన వ్యక్తి పీసీసీ చీఫ్ అని ఎద్దేవా చేశారు.
డ్రగ్స్ కేసులో ఎలాంటి సంబంధం లేని మంత్రి కేటీఆర్‌పై అసత్య ఆరోపణలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబు డైరెక్షన్లో పని చేస్తూ మా నాయకులను ఇష్టమొచ్చినట్లు మాట్లాడితే ఊరుకునేది లేదని హెచ్చరించారు. తక్షణమే రేవంత్ రెడ్డి బహిరంగ క్షమాపణ చెప్పాలని రాష్ట్ర క్రీడా ప్రాధికార సంస్థ ఛైర్మన్ వెంకటేశ్వర రెడ్డి డిమాండ్ చేశారు. లేనిపక్షంలో రేవంత్ ఇంటిని ముట్టడిస్తామన్నారు. ఈ ఆందోళనలో తెరాస యువజన విభాగం గ్రేటర్ హైదరాబాద్ అధ్యక్షుడు అలకుంట హరి పాల్గొన్నారు.
ఇదీ చూడండి: White challenge issue: ప్రత్యేక బృందాలతో విచారణ చేస్తే బండారం బయటపడేది: రేవంత్