కేసీఆర్ ప్రతిపాదించిన దివంగత ప్రధాని పీవీ నరసింహారావు కూతురు వాణీ దేవిని పట్టభద్రుల ఎన్నికల్లో అత్యధిక మెజారిటీతో గెలిపిస్తామని గోషమహల్ తెరాస ఇంఛార్జి ప్రేమ్ సింగ్ రాథోడ్ స్పష్టం చేశారు.
ముఖ్యమంత్రి ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలకు ఆకర్షితులై ప్రజలు స్వచ్ఛందంగా సభ్యత్వం తీసుకుంటున్నారని పేర్కొన్నారు. గోషమహల్ నియోజకవర్గంలో తెరాస సభ్యత్వ నమోదు కార్యక్రమంతో పాటు హైదరాబాద్-రంగారెడ్డి-మహబూబ్‌నగర్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల సన్నాహక సమావేశం హైదరాబాద్‌లో జరిపారు.
కేసీఆర్ పెద్దమన్సుతో మాజీ ప్రధాని పీవీ కుమార్తెను బరిలో ఉంచి తన ఔదార్యాన్ని చాటుకున్నారని అన్నారు. కార్యక్రమంలో తెరాస నాయకులు, మాజీ కార్పొరేటర్లు, కార్యకర్తలు పెద్దఎత్తున పాల్గొని సభ్యత్వం స్వీకరించారు.
ఇదీ చూడండి: నాగార్జునసాగర్ భాజపా నేతలతో బండి భేటీ