ETV Bharat / state

వెంగళ్​రావు నగర్​ని మోడల్​ డివిజన్​గా మారుస్తా: దేదీప్య రావు

బల్దియా ఎన్నికల్లో తెరాస విస్తృతంగా ప్రచారం నిర్వహిస్తోంది. ప్రచారంలో భాగంగా జూబ్లీహిల్స్​ నియోజకవర్గంలోని వెంగళ్​రావు నగర్​ డివిజన్​లో అభ్యర్థి దేదీప్య రావు ప్రచారం నిర్వహించారు. పేద ప్రజల కోసం సీఎం కేసీఆర్​ ఎన్నో సంక్షేమ పథకాలు ప్రవేశ పెట్టారని, ప్రభుత్వం చేసిన అభివృద్ధిని చూసి ఓటేయాలని ఓటర్లను కోరారు.

trs candidate campaign in vengalrao nagar division
వెంగళ్​రావు నగర్​ని మోడల్​ డివిజన్​గా మారుస్తా: దేదీప్య రావు
author img

By

Published : Nov 24, 2020, 2:19 PM IST

వెంగళ్​​రావు నగర్ డివిజన్ రూపురేఖలు మార్చి మోడల్ డివిజన్​గా మార్చడమే తన ధ్యేయమని ఆ డివిజన్ తెరాస అభ్యర్థి దేదీప్య రావు పేర్కొన్నారు. బల్దియా ఎన్నికల్లో తన మీద నమ్మకం ఉంచి జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ టికెట్ ఇవ్వడం ఎంతో అదృష్టంగా భావిస్తున్నట్లు తెలిపారు. కార్పొరేటర్​గా తనని గెలిపిస్తే డివిజన్ అభివృద్ధి కోసం కృషి చేస్తానని హామీ ఇచ్చారు.

ప్రభుత్వంలో సీఎం కేసీఆర్.. పేద ప్రజల కోసం చేపట్టిన సంక్షేమ పథకాలు, అలాగే నియోజకవర్గంలో ఎమ్మెల్యే గోపీనాథ్ ఆధ్వర్యంలో కొనసాగుతున్న అభివృద్ధిని చూసి తెరాసని గెలిపించాలని అభ్యర్థి కోరారు. ప్రజలకు ఎల్లవేళలా అందుబాటులో ఉంటూ ప్రజా సమస్యలను పరిష్కరించే దిశగా ముందుకు వెళ్తానని ఆమె హామీ ఇచ్చారు.

వెంగల్​రావు నగర్​ని మోడల్​ డివిజన్​గా మారుస్తా: దేదీప్య రావు

ఇదీ చదవండి: ఊరెళ్లిన ఓటర్లు.. రప్పించేందుకు పార్టీల తిప్పలు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.