Tribute to Wining MLAs in Elections : రాష్ట్రంలో ఎన్నికల కోలాహలం ముగిసింది. శాసనసభ ఎన్నికల్లో తొలిసారిగా ఎన్నికైన ఎమ్మెల్యేలలో ఉత్సాహాన్ని నింపింది. తమను నమ్మి ఓటేసిన ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకుంటామని తెలిపారు. నిరంతరం ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని నియోజకవర్గ అభివృద్ధికి పాటుపడతామని పేర్కొన్నారు. బీఆర్‌ఎస్(BRS) ప్రభుత్వం చేసిన సంక్షేమ పథకాలు తనను గెలిపించాయని భద్రాచలం అసెంబ్లీ నుంచి గెలుపొందిన తెల్లం వెంకట్రావు అన్నారు.
ఖమ్మం జిల్లా పార్టీ కార్యాలయానికి తొలిసారిగా వచ్చిన ఆయన‌్ను ఘనంగా సన్మానించారు. అనంతరం మాట్లాడుతూ ప్రభుత్వ పథకాలను ఇంటింటికి వెళ్లి గుర్తు చేశానన్నారు. ముఖ్యమంత్రి పోడు భూముల సమస్యను పరిష్కరించడం కూడా కలిసి వచ్చిందన్నారు. తనను గెలిపించిన నియోజకవర్గ ప్రజలకు అండగా ఉంటానని పేర్కొన్నారు.
బీఆర్‌ఎస్ ఓటమిపై కన్నీటి పర్యంతమైన అభ్యర్థులు
BRS Uppal MLA Laxmareddy : మేడ్చల్ జిల్లా ఉప్పల్ బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి తనకు కేటాయించిన గన్‌మెన్లను వద్దని తిరస్కరించారు. అవినీతికి పాల్పడే వారికి గన్‌మెన్లు అవసరం కానీ నిత్యం ప్రజల్లో ఉండే వారికి గన్ మెన్లు అవసరం లేదన్నారు. తనకు నమ్మి టికెట్ ఇచ్చిన కేసీఆర్‌కు కృతజ్ఞతలు తెలిపారు. నియోజకవర్గ అభివృద్ధికి కృషి చేస్తానని పేర్కొన్నారు.
బీఆర్‌ఎస్ ప్రభుత్వంపై వ్యతిరేకత, స్థానిక ఎమ్మెల్యేపై ప్రజల్లో ఉన్న అసహనమే తన విజయానికి దోహదపడిందని అదిలాబాద్ బీజేపీ అభ్యర్థి పాల్వాయి హరీశ్ పేర్కొన్నారు. నియోజకవర్గ అభివృద్ధిని కోనేరు కోనప్ప కుంటుపట్టించారని మండిపడ్డారు. తనను గెలిపించిన ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు.
తనను నమ్మి గెలిపించిన ప్రజలకు, తన విజయానికి కారకులైన కార్యకర్తలకు రుణపడి ఉంటానని నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధన్‌పాల్ సూర్యనారాయణ పేర్కొన్నారు. ప్రజల్లో బీఆర్‌ఎస్‌పై వ్యతిరేకత నెలకొందని అందుకే కేసీఆర్‌ను గద్దె దించారన్నారు. ప్రజలకు ఇచ్చిన హామీలను కచ్చితంగా నెరవేరుస్తానన్నారు. రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ మరిన్నీ విజయాలు సాధించాలని కోరుకుంటున్నట్లు తెలిపారు.
"బీఆర్‌ఎస్ ప్రభుత్వం చేసిన సంక్షేమ పథకాలు నన్ను గెలిపించాయి. ప్రభుత్వ పథకాలను ఇంటింటికి వెళ్లి గుర్తు చేశాను. ముఖ్యమంత్రి పోడు భూముల సమస్యను పరిష్కరించడం కూడా కలిసి వచ్చింది. నియోజకవర్గ ప్రజలకు రుణపడి ఉంటాను". - తెల్లం వెంకట్రావు, ఖమ్మం బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే
"నన్ను నమ్మి గెలిపించిన ప్రజలకు, నిజామాబాద్‌లో నా విజయానికి కారకులైన కార్యకర్తలకు రుణపడి ఉంటాను. ప్రజల్లో బీఆర్‌ఎస్‌పై వ్యతిరేకత నెలకొంది. అందుకే కేసీఆర్‌ను గద్దె దించారు. రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ మరిన్నీ విజయాలు సాధించాలి". - ధన్‌పాల్ సూర్య నారాయణ, బీజేపీ నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే