Travel Agency Cheating in Hyderabad : రాష్ట్రంలో రోజుకో ఛీటింగ్ కేసు (Cheating Case) వెలుగులోకి వస్తోంది. అమాయక ప్రజలను లక్ష్యంగా చేసుకొని కొందరు వ్యక్తులు మోసాలకు పాల్పడుతున్నారు. రిజిస్టర్ కాని కొన్ని చిన్నచిన్న ఫైనాన్స్ కంపెనీలు, ట్రావెల్ ఏజెన్సీ సంస్థలు యాథేచ్ఛగా బాధితుల నుంచి రూ. లక్షల్లో దోచుకొని ఒక్కసారిగా బోర్డు తిప్పేస్తున్నాయి. తాజాగా హైదరాబాద్‌లో ఇలాంటి నిర్వాకం వెలుగులోకి వచ్చింది. విదేశాలకు వెళ్లేందుకు సిద్ధమైన విద్యార్థుల నుంచి లక్షల్లో డబ్బులు వసూళ్లు చేసి ఓ ట్రావెల్ సంస్థ బోర్డు తిప్పేసింది. దీంతో బాధితులు లబోదిబోమంటూ రోడ్డున పడ్డారు.
railwayjobs cheating in adilabad : రైల్వే ఉద్యోగాల పేరిట బురిడీ.. మహిళ అరెస్ట్
CTS Travel Agency Cheat : బాధితుల కథనం ప్రకారం.. హైదరాబాద్‌లో సీటీఎస్ కార్పొరేట్ సొల్యూషన్ (CTS Corporate Solution) అనే ట్రావెల్ ఏజెన్సీ విద్యార్థుల నుంచి రూ.లక్షల్లో వసూలు చేసి బోర్డు తిప్పేసింది. అబిడ్స్‌లోని ఖాన్ లతీఫ్ ఖాన్ బిల్డింగ్‌లో సీటీఎస్ కార్పొరేట్ సొల్యూషన్ పేరుతో గత కొంతకాలంగా ట్రావెల్ ఏజెన్సీ నడుస్తోంది. అమెరికా, యూకె, కెనడా, స్విట్జర్లాండ్ దేశాలకు ఫ్లైట్ టికెట్స్ బుక్ చేస్తానని 40 మంది బాధితుల నుంచి లక్షల్లో డబ్బులు వసూలు చేశాడు. డబ్బులు చేతికి వచ్చిన తరువాత.. ఏజెంట్ కుతుబుద్ధీన్ పరారయ్యాడు.
CTS Corporate Solution Travel Agency Cheating : దీంతో విదేశాలకు వెళ్లాల్సిన విద్యార్థులు అయోమయంలో పడ్డారు. దీనిపై సుమారు 40 బాధితులు ట్రావెల్ ఏజెంట్‌పై అబిడ్స్ పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేయగా.. నిందితుడు అసలు విషయం వెలుగులోకి వచ్చింది. సీటీఎస్ కార్పొరేట్ ట్రావెల్ ఏజెన్సీపై గతంలోనూ పలు చీటింగ్ కేసులు నమోదయ్యాయి. ట్రావెల్ ఏజెన్సీ నిర్వాహకుడు కుతుబుద్ధీన్పై అబిడ్స్ పోలీసులు అరెస్ట్ వారెంట్ జారీ చేశారు.
ట్రావెల్ ఏజెన్సీ నిర్వాహకుడు కుతుబుద్ధీన్ దుబాయ్‌లో తలదాచుకున్నట్లు బాధిత విద్యార్థులు ఆరోపిస్తున్నారు. ఈనెల 15, 16 తేదీలలో అమెరికా వెళ్లేందుకు టికెట్స్ బుక్ (Flight Tickets) చేసుకున్నామని.. ఒక్కొక్కరి వద్ద సుమారు లక్షన్నర నుంచి రెండు లక్షల వరకు వసూళ్లు చేసినట్లు వాపోయారు. బాధితులందరి వద్ద సుమారు రూ. కోటి వరకు వసూలు చేశాడని బాధితులు పేర్కొన్నారు. దీనిపై పోలీసులు సమగ్రంగా విచారణ జరిపి తమను ఆదుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నారు.
"నేను విదేశాలకు వెళ్లేందుకు టికెట్ బుక్ చేసుకున్నాను. ఇవాళ సడన్‌గా టికెట్ క్యాన్షల్ అయ్యిందని మెసేజ్ చేశాడు. టికెట్ డిటైల్స్ రాకపోవడంతో బషీర్ బాగ్‌లోని ట్రావెల్ ఏజెన్సీ వద్దకు వచ్చాం. గత రెండు రోజులుగా షాప్ ఓపెన్ చేయలేదని చుట్టుపక్కల వాళ్లు తెలిపారు. దీంతో మేము అబిడ్స్ పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేశాం. ట్రావెల్ ఏజెన్సీ నిర్వాహకుడు పేరు కుతుబుద్ధీన్. అతను డబ్బులు తీసుకొని దుబాయ్ వెళ్లిపోయాడు. నా దగ్గర సుమారు రూ. 1.2లక్షలు వసూలు చేశాడు. అందరి దగ్గర సుమారు రూ. కోటి వరకు వసూలు చేశాడు. ప్రభుత్వమే మాకు న్యాయం చేయాలి."- బాధిత విద్యార్థి
Gold Chain Robbed a Woman : లాటరీ వచ్చిందని నమ్మించాడు.. మహిళ నుంచి బంగారం దోచేశాడు...
Bike Theft Live Video in Siddipet : దొంగా.. దొంగా వచ్చాడే.. దర్జాగా దోచుకుపోయాడే..