ETV Bharat / state

బంజారాహిల్స్ పోలీసులను సన్మానించిన ట్రాన్స్​జెండర్లు - పోలీసులను సన్మానించిన ట్రాన్స్​జెండర్లు

ట్రాన్స్​జెండర్లను వేధింపులకు గురి చేసిన కుర్మా వెంకట్​కు శిక్షపడేలా చేసినందుకు బంజారాహిల్స్​ పోలీసు అధికారులను ఘనంగా సన్మానించారు. పీఎస్​కు వెళ్లి ఏసీపీ, సీఐలను సత్కరించి వారికి కృతజ్ఞతలు తెలిపారు.

Transgenders honoring Banjara hills police officers today in ps
బంజారాహిల్స్ పోలీసులను సన్మానించిన ట్రాన్స్​జెండర్లు
author img

By

Published : Dec 28, 2020, 7:25 PM IST

హైదరాబాద్​లోని బంజారాహిల్స్‌ పీఎస్​ పరిధిలో ట్రాన్స్​జెండర్లపై వేధింపులకు పాల్పడిన కుర్మా వెంకట్​కు శిక్షపడేలా చేసినందుకు పోలీసు అధికారులకు కృతజ్ఞతలు తెలిపారు. పీఎస్​కు వెళ్లి ఏసీపీ సుదర్శన్, సీఐ కళింగరావులను ట్రాన్స్​జెండర్లు ఘనంగా సత్కరించారు.

బంజారాహిల్స్‌ పోలీస్​స్టేషన్ పరిధిలో కుర్మా వెంకట్‌, అతని ముఠా నిత్యం తమను వేధింపులకు గురిచేస్తున్నారంటూ గతంలో పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేసి, న్యాయస్థానంలో శిక్షపడేలా సాక్ష్యాధారాలను నివేదించారు. విచారణలో న్యాయస్థానం ఇటీవలే నిందితునికి శిక్ష విధించింది.

ఇదీ చూడండి: రోడ్డుపై పడుకున్న మందుబాబు... ట్రాఫిక్​కు అంతరాయం

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.