దూద్ దురంతో ప్రత్యేక రైళ్లు 2020-21 ఆర్థిక సంవత్సరంలో 7 కోట్ల లీటర్ల పాల రవాణా మైలు రాయిని అధిగమించాయని దక్షిణ మధ్య రైల్వే అధికారులు తెలిపారు. రేణిగుంట నుంచి ప్రారంభమయ్యే ఈ రైళ్లలో రవాణా ప్రారంభించిన తర్వాత ఎన్నడూ లేనంతగా అధిక మొత్తంలో పాలను ఇతర ప్రాంతాలకు తరలించినట్లు ప్రకటించారు.
2011-12 ఆర్థిక సంవత్సరంలో ప్రారంభమైన దూద్ దురంతో రైళ్లు ఇప్పటి వరకు ఏడాదికి సరాసరిగా 2 నుంచి 3 కోట్ల లీటర్ల పాలను మాత్రమే రవాణా చేసినట్లు రైల్వే శాఖ అధికారులు తెలిపారు. లాక్డౌన్ సమయంలో పాల సరఫరా సవాలుగా మారిందని పేర్కొన్నారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఇప్పటి వరకు 296 ట్రిప్పులలో మొత్తం 1,753 పాల ట్యాంకర్లతో 7 కోట్ల లీటర్ల పాలను సరఫరా చేశామని వివరించారు.
ఇదీ చదవండి: వారసత్వంపై 84% మంది సంపన్నుల పునఃసమీక్ష!