Agnipath Protest in Secunderabad: 'అగ్నిపథ్' ఆందోళనలతో సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ రణరంగంగా మారింది. నిరసనకారుల బీభత్సానికి స్టేషన్‌లోని కీలక వస్తువులు ధ్వంసమయ్యాయి. రైల్వే పట్టాలపై చెల్లాచెదురుగా పడిపోయాయి. ప్రయాణికుల వస్తువులనూ ధ్వంసం చేసిన ఆందోళనకారులు.. గూడ్స్ రైళ్ల నుంచి ద్విచక్ర వాహనాలను కిందకు దింపి తగులబెట్టారు. పలు ఎలక్ట్రిక్ పరికరాలనూ ధ్వంసం చేశారు.
సికింద్రాబాద్ ఆందోళనకారుల ఘటనలో... మూడు రైళ్లు దెబ్బతిన్నాయని దక్షిణ మధ్య రైల్వే CPRO రాకేశ్ తెలిపారు. ఉదయం 9 గంటలకే ఆందోళనకారులు రైల్వేస్టేషన్‌లోకి వచ్చారన్న CPRO.... ప్రయాణికులకు ఇబ్బందులు కలగకుండా సురక్షితంగా తరలించామని చెప్పారు. పాడైన రైల్వే సామగ్రి మరమ్మతులకు సమయం పట్టే అవకాశం ఉన్న నేపథ్యంలో ఇవాళ సికింద్రాబాద్ నుంచి రైళ్ల రాకపోకలు ఉండవని సమాచారం. ఈ అల్లర్లతో ఇప్పటికే 72 రైళ్లను రద్దు చేయగా.. 12 రైళ్లను పాక్షికంగా రద్దు చేశారు. మూడింటిని దారి మళ్లించారు.
సంబంధిత కథనాలు..
Agnipath effect: అగ్నిపథ్ ఆందోళనలతో 200 రైలు సర్వీసులపై ఎఫెక్ట్..
Agnipath Protests in Secunderabad :పోలీసుల కాల్పుల్లో ఒకరు మృతి.. నలుగురికి బుల్లెట్ గాయాలు
అగ్నిపథ్ విషయంలో యువతను తప్పుదారి పట్టిస్తున్నారు: కిషన్‌రెడ్డి
Agnipath Protest in Secunderabad : సికింద్రాబాద్‌లో 'అగ్నిపథ్' అల్లర్లు.. పక్కా ప్లాన్‌తోనే..!