Trainee IPS Parade in Hyderabad : జాతీయ పోలీస్ అకాడమీ.. 175 మంది ఐపీఎస్‌ల దీక్షాంత్ సమారోహ్‌కు వేదిక కానుంది. దేశానికి చెందిన 155 మందితో పాటు.. 20 ఫారెన్ ట్రైనీ ఆఫీసర్‌లు వీళ్లతో కలిసి శిక్షణ పొందారు. 155 మంది ఐపీఎస్‌లలో 123 మంది పురుషులు, 32 మంది మహిళలున్నారు. వేరే ఉద్యోగాలు చేస్తూ ఐపీఎస్ సాధించిన వాళ్లు 91 మంది ఉండగా.. నేరుగా ఐపీఎస్ సాధించిన వాళ్లు 64మంది ఉన్నారు. ఎక్కువగా ఇంజనీరింగ్ విద్య నుంచి వచ్చిన వాళ్లే ఈ బ్యాచ్ లో ఉన్నారు.
కానిస్టేబుల్స్ టు IPS.. ఇద్దరు వీరవనితల విజయ ప్రస్థానం
Dikshant Samaroh in Hyderabad : 102 మంది ఇంజనీరింగ్ విద్యనభ్యసించిన వాళ్లుండగా.. ఆ తర్వాత ఆర్ట్స్ నుంచి వచ్చిన వాళ్లు 17, సైన్స్ 12మంది, కామర్స్ 10, వైద్య విద్య పూర్తి చేసి ఐపీఎస్‌లుగా ఎంపికైనా వాళ్లు 9మంది ఉన్నారు. న్యాయ విద్య నుంచి వచ్చిన వాళ్లు కేవలం ముగ్గురున్నారు. 75వ బ్యాచ్ లో తెలంగాణ నుంచి 5గురు, ఆంధ్రప్రదేశ్ నుంచి ఆరుగురున్నారు. తెలంగాణ నుంచి ఎంపికై తెలంగాణకు కేటాయించిన వాళ్లలో నలుగురు ఐపీఎస్ లున్నారు. గత బ్యాచ్ తో పోలిస్తే ఈ ఏడాది కొత్త అంశాలనూ శిక్షణలో చేర్చారు
Amit Shah in Dikshant Samaroh in Hyderabad : శిక్షణలో భాగంగా పలు రకాల సబ్జెక్ట్‌లను బోధించారు. ఎన్డీపీఎస్ చట్టంతో పాటు..పెరుగుతున్న సైబర్ నేరాలను నిరోధించే విధంగా శిక్షణ ఇచ్చారు. 11 నెలల పాటు మొదటి దశ శిక్షణ పూర్తి చేసుకున్నారు. ఇందులో భాగంగా ఐపీసీ, క్రిమినల్ ప్రొసీజర్ కోడ్, అంతర్గత భద్రత, శాంతి భద్రతలు, దర్యాప్తు, సమాచార సాంకేతికత, దృక్పథం, విలువలు, మానవ హక్కులు, నేరాలు వంటి అంశాలపై ఐపీఎస్ శిక్షణార్థులు తర్ఫీదు పొందారు. దేహదారుడ్యం, ఈత, డ్రైవింగ్, యోగ, తుపాకులు కాల్చడంలోనూ శిక్షణ పూర్తి చేశారు.
అడవుల్లో గ్రేహౌండ్స్ దళాలతో కలిసి కూంబింగ్లోనూ పాల్గొన్నారు. సరిహద్దు భద్రతా దళాలతో కలిసి విధులు నిర్వహించారు. మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లోనూ విధుల్లో పాల్గొన్నారు. ఎన్నికల బందోబస్తులోనూ పాల్గొన్నారు. ఈ బ్యాచులో 66 మంది 28 ఏళ్లు దాటిన వాళ్లు కాగా.. 80 మంది 25 నుంచి 28 ఏళ్ల వయసు.. 9 మంది 25 ఏళ్ల లోపు ఉన్నారు. ఈ బ్యాచ్‌లో తెలుగు రాష్ట్రాలకు మొత్తం 14 మందిని కేటాయించారు. ఇందులో తెలంగాణకు 9 మంది, ఏపీకీ ఐదుగురు ట్రైనీ ఐపీఎస్‌లను కేటాయించారు
జాతీయ పోలీస్ అకాడమీలో శిక్షణతో నేర్చుకున్న అంశాలను క్షేత్రస్థాయిలో అమలుపర్చి సమాజంలో శాంతిభద్రతలకు తోడ్పాటునందిస్తామని యువ ఐపీఎస్‌లు చెబుతున్నారు. 175 మంది ఐపీఎస్‌ల దీక్షాంత్ సమారోహ్‌కు.. కేంద్ర హోంమంత్రి అమిత్ షా ముఖ్య అతిథిగా పాల్గోనున్నారు.
"ఐపీఎస్ ట్రైనింగ్ పూర్తిచేసుకున్నందుకు సంతోషంగా ఉంది. నాకు తెలంగాణకే పోస్టింగ్ ఇచ్చారు. నేను ఐపీఎస్ సాధించడానికి కుటుంబ సభ్యుల ప్రోత్సాహం చాలా ఉంది. ఐపీఎస్‌కు ఎంపికకావడం ఒక ఛాలెంజ్ అయితే.. శిక్షణ తీసుకోవడం పూర్తి చేసుకోవడం అంతకంటే గొప్పు విషయం". - చైతన్యరెడ్డి , ట్రైనీ ఐపీఎస్
అప్పుడు ఇంగ్లిష్ ఫెయిల్ స్టూడెంట్.. ఇప్పుడు పవర్ఫుల్ IPS ఆఫీసర్!