ETV Bharat / state

Traffic Violations Challan (Fines) Rates in Telangana : రోడ్డెక్కారా..? జర చూస్కొని పొండి.. లేదంటే మాత్రం..!! - What penalties violating traffic rules Telangana

Traffic Fines List in Telangana : రోడ్డుపై దూసుకెళ్లడానికి.. బండి చేతిలో ఉండి, అందులో పెట్రోల్ ఉంటే సరిపోదు. ఇంకా చాలా కావాలి. ఒకవేళ అవన్నీ ఉన్నాయంటారా..? అయినా కూడా ఇష్టమొచ్చినట్టు వెళ్లడానికి లేదు. ప్రతి వాహనానికీ నిర్దిష్టమైన రూల్ ఉంది. నిబంధన ఉంది. ఇవన్నీ పట్టించుకోకపోతే.. మీరు ఇంటికెళ్లరు.. ఇంకెక్కడికో వెళ్లే ప్రమాదం ఉంది! అందుకే.. తెలంగాణలో పక్కాగా అమలవుతున్న ట్రాఫిక్ రూల్స్ గురించి పూర్తిగా తెలుసుకోండి.

Traffic Violations Fines in Telangana
Traffic Violations Challan (Fines) Rates in Telangana
author img

By ETV Bharat Telangana Team

Published : Aug 30, 2023, 3:40 PM IST

Traffic Violations Fines in Telangana : దేశంలో మోటారు వాహనాల చట్టం ద్వారా తీసుకొచ్చిన ట్రాఫిక్ నియమాలు, నిబంధనలు తప్పనిసరిగా పాటిస్తూ రోడ్డు ప్రమాదాలను(Road Accidents) ఆరికట్టాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపైనా ఉంది. ఈ నియమాలు దాదాపు దేశమంతటా ఒకేలా ఉంటాయి. 2019 నుంచి అమల్లోకి వచ్చిన కొత్త మోటార్ వెహికిల్ చట్టం ప్రకారం.. తెలంగాణ ట్రాఫిక్ పోలీసులు కఠిన ఆంక్షల్ని అమలు చేస్తున్నారు. నిబంధనలు పాటించకుండా వాహనాలను నడిపే వారిపై చర్యలు చేపడుతున్నారు.

Telangana Traffic Challans Details : రాష్ట్రంలో ప్రధాన నగరాలు, పట్టణాలతోపాటు.. హైదరాబాద్ నగరంలో(Traffic Rules in Hyderabad) ట్రాఫిక్ రోజురోజుకూ విపరీతంగా పెరుగుతుండడంతో.. తెలంగాణ ట్రాఫిక్ పోలీసులు అదే స్థాయిలో యాక్టివ్ అవుతున్నారు. ఇటీవల "ఆపరేషన్ రోప్" పేరుతో.. ట్రాఫిక్ రూల్స్ అతిక్రమించే వారిపై కఠిన చర్యలే తీసుకుంటున్నారు. మరోవైపు.. అధునాతన సాంకేతికతతో రూపొందించిన సీసీ కెమెరాలను(CC Cameras) రాష్ట్రంలోని ప్రధాన నగరాలలో ఏర్పాటు చేస్తూ.. ట్రాఫిక్ రూల్స్ పాటించని వారి భరతం పడుతున్నారు. ఇంతకీ తెలంగాణలో ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘిస్తే ఏం జరుగుతుంది? పోలీసులు ఎలాంటి వాతలు పెడుతున్నారో తెలుసుకోవాలంటే.. ఈ స్టోరీ చదవాల్సిందే.

రాంగ్ సైడ్ డ్రైవింగ్, ట్రిపుల్ రైడింగ్‌ చేస్తే ఇకపై భారీ జరిమానా..!

లైసెన్స్ లేని డ్రైవింగ్ (Driving without a Driving License) : మోటారు వాహనాల చట్టంలోని సెక్షన్ 177 ప్రకారం ఇది శిక్షార్హమైన నేరం. 2019 సెప్టెంబర్ నుంచి అమలులోకి వచ్చిన కొత్త ట్రాఫిక్ రూల్స్ ప్రకారం.. లైసెన్స్ లేకుండా బండి నడిపితే.. రూ.500 జరిమానా విధిస్తారు. అలాగే 3 నెలల వరకు జైలు శిక్ష విధించే అవకాశం ఉంది.

  • అర్హత లేని వ్యక్తి వాహనం నడిపితే : వాహనాన్ని అర్హత లేని వ్యక్తి నడిపితే.. ఆ వాహన యజమానికి శిక్ష విధిస్తారు. ఇందుకు.. రూ.500 జరిమానా లేదా 3 నెలల జైలు శిక్ష విధిస్తారు. ఒక్కోసారి రెండూ విధించే ఛాన్స్ ఉంది.
  • L చిహ్నాన్ని ప్రదర్శించాలి : చట్టం ప్రకారం లైసెన్స్ లేకుండా రోడ్డుపై వాహనం నడపకూడదు. అలాగే మీరు డ్రైవింగ్ నేర్చుకుంటున్నట్లయితే.. తప్పనిసరిగా లెర్నర్ లైసెన్స్ పొందాలి. అలాగే వాహనంపై తప్పనిసరిగా ఎరుపురంగులో L సింబల్ ఉండాలి. లేనట్లయితే రూ. 500 జరిమానా విధిస్తారు.
  • ఆర్​సీ లేకపోతే..(Driving without RC): చట్టం ప్రకారం చెల్లు బాటు అయ్యే.. వాహన రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్(ఆర్​సీ) ఉండాలి. అది లేకుండా వాహనం నడిపితే మొదటిసారి రూ.3000, ఆ తర్వాత కూడా నడిపితే రూ.5,000 జరిమానా విధిస్తారు.
  • ఫిట్‌నెస్ సర్టిఫికేట్ లేకపోతే (Without fitness certificate) : మోటారు వాహన చట్టం సెక్షన్ 56 ప్రకారం.. చెల్లుబాటు అయ్యే ఫిట్‌నెస్ సర్టిఫికేట్ లేకుండా రవాణా వాహనాన్ని నడిపితే నడుపుతున్న డ్రైవర్లు లేదా యజమానులకు మొదటి సారి 5 వేలు, రెండవ రూ.10,000 జరిమానా విధిస్తారు. ఒక్కోసారి పెనాల్టీతో పాటు జైలుకు కూడా పంపే అవకాశం ఉంది.
  • అధిక లోడ్​తో వాహనాలను నడిపితే : చట్టంలోని సెక్షన్ 194A ప్రకారం.. పరిమితికి మించి ఎక్కువ మంది ప్రయాణీకులతో వాహనాన్ని నడిపితే.. ప్రతీ అదనపు ప్రయాణికుడికి రూ.200 జరిమానా విధిస్తారు.

Traffic Rules News: వాహనం నడుపుతూ ఫోన్​లో మాట్లాడుతున్నారా.. ఇక మీరు జైలుకే!

  • బీమా లేకుండా డ్రైవింగ్ చేస్తే: గడువు ముగిసిన బీమా పాలసీతో వాహనం డ్రైవింగ్ చేస్తే.. మొదటి నేరానికి ₹2000, రెండోసారి ₹4,000 జరిమానా లేదా 3 నెలల వరకు జైలు శిక్ష ఉంటుంది.
  • అత్యవసర వాహనాలకు దారి ఇవ్వకపోతే : చట్టంలోని సెక్షన్ 194 E ప్రకారం.. అంబులెన్స్‌లు, ఫైర్ సర్వీస్ లాంటి అత్యవసర వాహనాలకు దారి ఇవ్వకపోతే 10,000 జరిమానా లేదా ఆరు నెలల వరకు జైలు శిక్ష ఉంటుంది.
  • మొబైల్ ఫోన్ వాడకం(Mobile Phone Use While Driving) : డ్రైవింగ్ చేస్తున్నప్పుడు ఫోన్ మాట్లాడితే.. ₹2000 నుంచి ₹10,000 వరకు జరిమానా వేస్తారు. మొదటి నేరం జరిగిన మూడేళ్లలోపు.. మరోసారి తప్పు చేస్తే.. జరిమానాతోపాటు సంవత్సరం జైలు శిక్ష విధిస్తారు.
  • అతివేగం( Over Speed) : చట్టం 1988లోని సెక్షన్ 112 ప్రకారం పరిమితికి మించిన వేగంతో మోటారు వాహనాన్ని నడిపితే ద్విచక్ర వాహనం/LMVలకు ₹1000, మీడియం/హెవీ గూడ్స్/ప్యాసింజర్ వాహనాలకు ₹2000 జరిమానా విధిస్తారు.
  • సిగ్నల్ జంప్ : నో ఎంట్రీ, వన్-వే ఎంట్రీ, గివ్ వే, నో లెఫ్ట్ టర్న్, నో రైట్ టర్న్, నో ఓవర్‌టేకింగ్ వంటి రహదారి సంకేతాలను ఉల్లంఘిస్తే.. మొదటి నేరానికి ₹500, రెండో తప్పునకు ₹1000 జరిమానా విధిస్తారు.
  • బహిరంగ ప్రదేశాలలో వాహనం పార్కింగ్ : బహిరంగ ప్రదేశంలో వాహనం పార్క్ చేసి.. రూల్స్ ఉల్లంఘిస్తే మొదటిసారి ₹500, రెండవ లేదా తదుపరి ఉల్లంఘనకు ₹1000 జరిమానా కట్టాలి.
  • హెల్మెట్ లేకుండా డ్రైవింగ్(Driving without a Helmet) : మోటారు సైకిల్ నడుపుతూ హెల్మెట్ లేకుండా ట్రాఫిక్ పోలీసులకు చిక్కితే వెయ్యి రూపాయల జరిమానాతో పాటు మూడు నెలల వరకు లైసెన్స్ సస్పెన్షన్‌ ఉంటుంది.
  • ట్రిపుల్ రైడింగ్(Triple Riding on Bikes) : ద్విచక్ర వాహనంపై ట్రిపుల్ రైడింగ్ చేస్తే రూ.1000 జరిమానాతో పాటు 90 రోజుల పాటు లైసెన్స్ క్యాన్సిల్ చేస్తారు.

బైక్‌పై చిన్నారులను తీసుకెళ్తున్నారా? ఇవి తప్పనిసరి!

  • అనవసరంగా హారన్ కొడితే : డ్రైవర్ అనవసరంగా హారన్ ఉపయోగించడం, హారన్ ఉపయోగించడాన్ని నిషేధించే ట్రాఫిక్ గుర్తు ఉన్న ప్రదేశంలో అనవసరంగా హారన్ మోగిస్తే.. మొదటి సారి ₹1000, రెండో సారికి ₹2000 జరిమానా విధిస్తారు.
  • సీటు బెల్ట్ పెట్టుకోకపోతే (Driving without a Seat Belt) : కారు నడుపుతున్నప్పుడు సీట్ బెల్ట్ ధరించకపోతే.. రూ.1000 జరిమానా విధిస్తారు. అవసరమైతే ట్రాఫిక్ పోలీసులు వాహనాన్ని స్వాధీనం చేసుకోవచ్చు. డ్రైవింగ్ లైసెన్స్‌ను కూడా సస్పెండ్ చేయవచ్చు.
  • పిల్లలు వాహనం నడిపితే : 14 ఏళ్లలోపు పిల్లలు మోటారు వాహనాన్ని నడిపితే.. అందుకు అనుమతించిన వారికి 1000 జరిమానా విధిస్తారు.
  • ట్రాఫిక్ చలాన్ చెల్లించకపోతే : ఎవరైనా తమ వాహనంపై ఈ-చలాన్ పడితే.. 60 రోజులలోపు జరిమానా చెల్లించాలి. లేకపోతే.. పెనాల్టీ కోసం ట్రాఫిక్ పోలీసు అధికారి మీ ఇంటి అడ్రస్​కు రావచ్చు. ఆ సమయంలో కూడా చెల్లించకపోతే.. కేసు కోర్టుకు వెళ్తుంది.

మద్యం తాగి వాహనం నడుపుతున్నారా.. అయితే రక్తదానం చేయాల్సిందే!

'అఖండ.. పుష్ప.. కేజీఎఫ్.. అన్నింటినీ వాడేస్తున్నారు'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.