ETV Bharat / state

మీరాలం ఈద్గా పరిసరాల్లో ట్రాఫిక్​ ఆంక్షలు

ఈద్​-ఉల్​-ఫితర్​ దృష్ట్యా ఈద్గా పరిసర ప్రాంతాల్లో ట్రాఫిక్​ ఆంక్షలు అమలులో ఉంటాయని నగర పోలీసులు తెలిపారు. ఉదయం 8 నుంచి 12 గంటల వరకు మీరాలం ట్యాంక్​ ఈద్గా పరిసరాల్లో ట్రాఫిక్​ ఆంక్షలు విధించారు.

మీరాలం ఈద్గా పరిసరాల్లో ట్రాఫిక్​ ఆంక్షలు
author img

By

Published : Jun 5, 2019, 10:36 AM IST

నెల రోజులుగా కఠోర ఉపవాస దీక్షలు చేసిన ముస్లిం సోదరులు ఇవాళ పవిత్ర ఈద్​-ఉల్​-ఫితర్​ (రంజాన్​) ప్రార్థనల్లో పాల్గొనున్నారు. పాతబస్తీలోని మీరాలం ఈద్గాలో ప్రత్యేక ప్రార్థనలు చేయనున్నారు. వక్ఫ్ బోర్డు, మైనార్టీ సంక్షేమ శాఖలు ప్రార్థనలు నిర్వహించేందుకు వచ్చే వారికి ఎటువంటి అసౌకర్యం కలగకుండా ఏర్పాట్లు చేసింది. ఈద్​-ఉల్​-ఫితర్​ సందర్భంగా ఉదయం 8 నుంచి 12 గంటల వరకు మీరాలం ట్యాంక్​ ఈద్గా పరిసర ప్రాంతాల్లో ట్రాఫిక్​ ఆంక్షలు అమల్లో ఉంటాయని తెలిపారు.

ట్రాఫిక్​ మళ్లింపు ఇలా...

మీరాలం ఈద్గా ప్రార్థనలకు వచ్చే వాహనాలకు పురానాపూల్​, కామాటిపుర, కిషన్​బాగ్​, బహుదూర్​పురా ఎక్స్​రోడ్​ నుంచి అనుమతి ఉంటుందని పోలీసులు తెలిపారు. ఆ సమయాల్లో ఇతర వాహనాలను బహుదూర్​పురా ఎక్స్​రోడ్​ నుంచి ఈద్గా వైపు వెళ్లేందుకు అనుమతి లేదన్నారు. ఆయా వాహనాలు కిషన్​బాగ్​, కామాటిపుర వైపు నుంచి వెళ్లాల్సి ఉంటుందని ట్రాఫిక్​ పోలీసులు తెలిపారు. సైకిళ్లు, రిక్షాలకు ఈద్గా వైపు అనుమతించమన్నారు. శివరాంపల్లి, ఎన్​పీఏ వైపు నుంచి ప్రార్థనలకు వచ్చే వాహనాలను అనుమతిస్తామని, బహుదూర్​పుర వైపు వెళ్లే సాధారణ వాహనాలను దానమ్మ హాట్స్​ చౌరస్తా వద్ద మళ్లిస్తామని తెలిపారు. వాహనదారులు గుర్తించి సహకరించాలని కోరారు.

మీరాలం ఈద్గా పరిసరాల్లో ట్రాఫిక్​ ఆంక్షలు

ఇవీ చూడండి: భాజపా ముస్లిం సంక్షేమ పార్టీ: లక్ష్మణ్

sample description
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.