Traffic Restrictions In PM Tour: హైదరాబాద్ గచ్చిబౌలిలోని ఐఎస్‌బీ వార్షికోత్సవానికి ప్రధాని హాజరుకానున్న దృష్ట్యా సైబరాబాద్ పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. కమిషరేట్ పరిధిలో కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లు చేస్తున్నారు. నిబంధనలు అతిక్రమిస్తే చర్యలు తప్పవని పోలీసులు హెచ్చరించారు. ఐఎస్‌బీకి 5 కి.మీ. పరిధిలో రిమోట్ కంట్రోల్ డ్రోన్లు, పారా గ్లైడింగ్, మైక్రో లైట్ ఎయిర్‌క్రాప్ట్స్ ఎగిరేందుకు నిషేధం విధించారు. ఇలాంటి వాటితో ఉగ్రదాడులు జరిగే ప్రమాదముందని ఇంటెలిజెన్స్ బ్యూరో (ఐబీ) హెచ్చరించిందని.. నిబంధనలు అతిక్రమిస్తే కఠిన చర్యలు తప్పవన్నారు. ఈనెల 25న మధ్యాహ్నం 12 గంటల నుంచి నుంచి 26వ తేదీ సాయంత్రం సాయంత్రం 6 గంటల వరకు ఆంక్షలు అమల్లో ఉంటాయని పోలీసులు వెల్లడించారు. గచ్చిబౌలి స్టేడియం పరిసరాల్లోని కంపెనీలు పనివేళలు మార్చుకోవాలని పోలీసులు సూచించారు. ఐఐటీ, విప్రో కూడలిలో ఉన్న కంపెనీలు మార్పులు చేయాలని వివరించారు.
ఈనెల 26న మధ్యాహ్నం ఒంటి గంట నుంచి సాయంత్రం 5 గంటల వరకు ట్రాఫిక్ ఆంక్షలు అమలయ్యే ప్రాంతాలివే...
- గచ్చిబౌలి-లింగంపల్లి వెళ్లే వాహానాలు బొటానికల్ గార్డెన్-కొండాపూర్ ఏరియా ఆస్పత్రి-మసీద్ బండ-హెసీయూ డిపో మీదుగా వెళ్లాలి.
- లింగంపల్లి నుంచి గచ్చిబౌలి వచ్చే వాహనదారులు హెసియూ డిపో -మసీద్ బండ-కొండాపూర్ ఏరియా ఆస్పత్రి-బొటానికల్ గార్డెన్ మీదుగా వెళ్లాలి.
- విప్రో కూడలి నుంచి లింగంపల్లికి వెళ్లేవారు క్యూ సిటీ- గౌలిదొడ్డి- గోపనపల్లి క్రాస్ రోడ్ -హెచ్సీయూ వెనుక గేట్- నల్లగండ్ల మీదుగా పోవాలి.
- విప్రో కూడలి నుంచి గచ్చిబౌలికి వెళ్లేవారు ఫెయిర్ ఫీల్డ్ హోటల్-నానక్ రామ్ గూడ రోటరీ- ఓఆర్ఆర్-ఎల్ఆండ్ టీ టవర్స్ మీదుగా వెళ్లాలి.
- తీగల వంతెన నుంచి గచ్చిబౌలి కూడలికి వెళ్లేవారు రత్నదీప్-మాదాపూర్ పోలీస్టేషన్- సైబర్ టవర్స్- కొత్తగూడ- బొటానికల్ గార్డెన్ మీదుగా వెళ్లాలని సూచించారు.
ఇవీ చూడండి: మోదీ హైదరాబాద్ పర్యటనకు భద్రతా ఏర్పాట్లు.. వారిపై ముందస్తు చర్యలు
ప్రపంచ రికార్డ్.. 11కి.మీ పొడవైన వస్త్రం.. అమ్మవారికి సమర్పించిన సీఎం