ETV Bharat / state

హైదరాబాద్​లోని ఆ ప్రాంతాల్లో ట్రాఫిక్​ ఆంక్షలు - మిలాద్‌–ఉన్‌–నబీ పర్వదినం

హైదరాబాద్​లో ముస్లిం సోదరుల పర్వదినం మిలాద్‌–ఉన్‌–నబీ సందర్భంగా శుక్రవారం(అక్టోబర్​ 30)రోజున పలు ప్రాంతాల్లో పోలీసులు ట్రాఫిక్​ ఆంక్షలు విధించారు. ప్రజలు ట్రాఫిక్​ నిబంధనలు పాటించి సహకరించాలని ట్రాఫిక్‌ అదనపు పోలీస్​ కమిషనర్‌ అనిల్‌కుమార్‌ పేర్కొన్నారు.

Traffic restrictions in charminar areas of Hyderabad
హైదరాబాద్​లోని ఆ ప్రాంతాల్లో ట్రాఫిక్​ ఆంక్షలు
author img

By

Published : Oct 29, 2020, 5:16 PM IST

ముస్లిం సోదరులు భక్తి శ్రద్ధలతో నిర్వహించే మిలాద్‌–ఉన్‌–నబీ పర్వదినం సందర్భంగా జంటనగరాల్లోని పలు ప్రాంతాల్లో పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. ఊరేగింపును పురస్కరించుకుని శుక్రవారం ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం ఆరు గంటల వరకు ఆంక్షలు అమల్లో ఉంటాయని ట్రాఫిక్‌ అదనపు పోలీస్​ కమిషనర్‌ అనిల్ ‌కుమార్‌ తెలిపారు.

చార్మినార్‌, శాలిబండ చౌరస్తాకు వెళ్లే వాహనాలను కిల్వత్‌, నాగులచింత, మొఘుల్‌ పుర ప్రాంతాల మీదగా మళ్లిస్తారు. మోతీగల్లీ గుండా వెళ్లే వాహనాలను మూసాబౌలీ నుంచి పంపిస్తారు. గుల్జార్‌ హౌజ్‌ మీదుగా వచ్చే వాహనాలను మిట్టీకాషేర్‌ మీదుగా... ఊరేగింపు మదీనా వద్దకు చేరుకున్న తర్వాత అఫ్జల్‌గంజ్‌ నుంచి వచ్చే వాహనాలను బేగం బజార్‌, మూసా బౌలీ ప్రాంతాలకు మళ్లిస్తారు. ప్రజలు ట్రాఫిక్‌ ఆంక్షలు పాటించి పోలీసులకు సహకరించాలని అనిల్ ‌కుమార్‌ కోరారు.

ఇదీ చూడండి : పోస్టర్‌ ఆవిష్కరణ కార్యక్రమంలో సినీ తారల సందడి

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.