ETV Bharat / state

దేశవ్యాప్త సమ్మెకు మద్దతు తెలిపిన కార్మిక సంఘాలు

author img

By

Published : Nov 26, 2020, 2:55 PM IST

నేడు దేశవ్యాప్త సమ్మెకు కార్మిక సంఘాలు మద్దతు తెలిపాయి. కేంద్రం ఆర్థిక విధానాలకు వ్యతిరేకంగా కార్మిక సంఘాలు రాష్ట్ర వ్యాప్తంగా ధర్నాలు నిర్వహించాయి. ప్రభుత్వ సంస్థల ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ.. విధులు బహిష్కరించి సింగరేణి కార్మికులు నిరసన చేపట్టారు. పలు ప్రాంతాల్లోని ఆర్టీసీ డిపోల్లో వామపక్ష నేతల ఆందోళన చేశారు.

Trade unions call for nationwide strike in telangana
దేశవ్యాప్త సమ్మెకు మద్దతు తెలిపిన కార్మిక సంఘాలు

దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెలో భాగంగా కార్మికులు విధులు బహిష్కరించి నిరసన తెలిపారు. నల్గొండ బస్ డిపో ఎదుట కార్మికులు బైఠాయించారు. బస్సులు బయటకు రాకుండా ప్రధాన ద్వారం ఎదుట నిరసన తెలిపారు. పొరుగు సేవల విధానానికి చరమ గీతం పాడి.. కనీస వేతనాలు పెంచాలంటూ నినాదాలు చేశారు.

ఖమ్మం జిల్లా వ్యాప్తంగా అన్ని బస్సులను బయటకు రాకుండా తెల్లవారుజాము నుంచే డిపోల ఎదుట అఖిలపక్షం నాయకులు ఆందోళన చేశారు. నరేంద్ర మోదీ రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత కార్మికులకు రక్షణగా ఉన్న చట్టాలను రద్దు చేశారని.. వ్యవసాయ బిల్లులు తీసుకువచ్చి రైతుల నడ్డి విరిచే చర్యలు తీసుకుంటున్నారని ఆరోపించారు.

సింగరేణిలో జాతీయ కార్మిక సంఘాలు సమ్మెకు పిలుపునిచ్చాయి. బెల్లంపల్లి, మందమర్రి, శ్రీరాంపూర్‌ బొగ్గు గనుల్లో ఉత్పత్తి నిలిచిపోయింది. భూపాలపల్లిలో సింగరేణి కార్మికులు సమ్మెలో పాల్గొన్నారు. కేంద్ర ప్రభుత్వ ఆర్థిక విధానాలను వ్యతిరేకించారు. ప్రభుత్వ సంస్థలు, బ్యాంకుల ప్రైవేటీకరణను నిరసించారు. కార్మిక వ్యతిరేక విధానాలను తిప్పికొట్టేందుకు సమ్మెను విజయవంతం చేయాలని కోరారు.

ఇదీ చూడండి : కార్మిక సంఘాల ఆందోళన.. స్తంభించిన రవాణా

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.