టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి (tpcc president revanth reddy) డ్రగ్ ఫ్రీ తెలంగాణ (White challenge) కోసం కృషి చేస్తున్నారని టీపీసీసీ ఉపాధ్యక్షుడు మల్లు రవి(mallu ravi) అన్నారు. ప్రజా ప్రతినిధులు పరీక్షలు చేయించుకొని ఆదర్శంగా ఉండాలని పేర్కొన్నారు. కేటీఆర్‌కు-రాహుల్‌కు భూమికి ఆకాశానికి ఉన్నంత తేడా ఉందని... కేటీఆర్, రాహుల్ గాంధీతో పోల్చుకోవడం ఏంటని ప్రశ్నించారు.
మంత్రి మల్లారెడ్డి అనుచిత వ్యాఖ్యలకు మద్దతు తెలిపినప్పుడు పరువు గుర్తుకు రాలేదా..? అని ప్రశ్నించారు. కేంద్ర ప్రభుత్వ విధానాలను నిరరిస్తూ అఖిలపక్షం ఆధ్వర్యంలో రేపు ఇందిరాపార్క్ వద్ద మహా ధర్నా చేపడతామన్నారు. ఈనెల 27న భారత్ బంద్, 30న కలెక్టరేట్‌ల వద్ద వినతిపత్రాలు సమర్పిస్తామన్నారు. అక్టోబర్ 5న పోడు భూములపై ఆదిలాబాద్ నుంచి అశ్వరావుపేట వరకు రాస్తారోకో నిర్వహిస్తామని మల్లు రవి వెల్లడించారు.
ఇది మీ నైతికతకే పరీక్ష. కేసు పెట్టుకోండి. మీరు పెట్టండి.. మీ కొలిగ్స్‌తో కేసు పెట్టించండి.. రాష్ట్ర ప్రభుత్వం అంతా కలిసి కేసు పెట్టండి. కానీ ఎన్ని కేసులు పెట్టినా డ్రగ్ ఫ్రీ తెలంగాణ చేసేంతవరకు కాంగ్రెస్‌పార్టీ, రేవంత్ రెడ్డి ప్రజల తరఫున పోరాటం చేస్తారు. ప్రతి కాంగ్రెస్ కార్యకర్త దీనికి పూర్తి మద్దతు తెలియజేస్తున్నారు. కేటీఆర్ గురించి మేమెక్కడా అసభ్యకరంగా మాట్లాడలేదు. కోర్టుకు వెళితే కోర్టే మీకు సరైన సమాధానం చెబుతుంది. మీరు పార్టీకి కార్యనిర్వాహక అధ్యక్షుడు... రేవంత్ రెడ్డి కాంగ్రెస్రాష్ట్ర అధ్యక్షుడు... మీరొచ్చి పరీక్ష చేయించుకోండి అంటే... చేయించుకుంటారా..? చేయించుకోరా..? ఏదొకటి చెప్పండి. మీరు నిజంగా ప్రజలకు ఆదర్శంగా నిలవాలంటే వచ్చి పరీక్ష చేయించుకోండి. లేకపోతే నేను చేయించుకోనని చెప్పండి. అంతేగాని రాహుల్‌గాంధీ పేరుచెప్పి... కాలయాపన చేసి పరీక్ష చేయించుకోకుండా బయటపడడానికే ఈ కార్యక్రమం జరుగుతోందని చూస్తున్న ప్రతి ఒక్కరికీ అర్థమవుతోంది.
మల్లురవి, టీపీసీసీ ఉపాధ్యక్షుడు
ఇదీ చూడండి: White challenge issue: ప్రత్యేక బృందాలతో విచారణ చేస్తే బండారం బయటపడేది: రేవంత్